పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 3:

విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, అందులో భాగంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ద్విభాషా(ఇంగ్లీష్ & తెలుగు) పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి విద్యార్థినిలకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచి బోధనకు చిరునామాగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే మంచిగా చదువుకోవాలని, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు చదువుకునే విద్య మాత్రమే పునాదిగా నిలబడుతుందని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య మాత్రమే మనలను అనుకున్న లక్ష్యం వైపుకు చేర్చుతుందని అన్నారు. మొత్తం 364 మంది విద్యార్ధినిలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణి చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. భోజనం, అల్పాహారం సరిగ్గా అందుతుందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా విద్యాధికారి యాదయ్య, స్థానిక కార్పొరేటర్ రావూరి కరుణ, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Share This Post