పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి .

 

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం

పాత్రికేయుల సమావేశంలో…

రిటర్నింగ్ అధికారి, ఆర్ డి ఓ సిహెచ్. రవీందర్ రెడ్డి

సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దు

0000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్ డి ఓ సిహెచ్ రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయము కరీంనగర్ లోని కొత్తపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గం ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారని, 86.64 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, పోటీచేసిన అభ్యర్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని, కౌంటింగ్ కు కూడా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు సహకారం అందించాలని కోరారు. శనివారం జరిగిన పోలింగ్ ప్రక్రియ లో హుజూరాబాద్ నియోజకవర్గం లోని పోలింగ్ స్టేషన్ నంబర్ 200లో మాక్ పోలింగ్ సమయంలో వివి ప్యాట్ సాంకేతిక సమస్య రావడముతో మొరాయించింది అని తెలిపారు. పనిచేయని వివి ప్యాట్ స్థానంలో సెక్టోరల్ అధికారి రిజర్వ్ లో ఉన్న వివి ప్యాటు అందజేశారని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి ప్రిసైడింగ్ అధికారి, సెక్టోరల్ అధికారి, పోలింగ్ సిబ్బంది, ఎస్కార్ట్ పోలీసులతో ఆర్టీసీ బస్సులో ఈవీఎం యంత్రాలతో కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల లోని రిసెప్షన్ సెంటర్ కు వచ్చారని తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికలకు ముందు పనిచేయని వివి ప్యాట్ ను కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిసెప్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన గోడౌన్ లో అప్పగించుట కు ఎదురుగా ఉన్న ఒక అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనం లో గోదాం కు తీసుకు వెళ్తున్న ప్రభుత్వ డ్రైవర్ దృశ్యాలను అనుమానంతో ఒకరు వీడియో తీసి వైరల్ చేస్తున్నారని , అట్టి పుకార్లను నమ్మవద్దని హుజురాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. డిఫెక్టెడ్ వివి pప్యాట్ లను ఇండోర్ స్టేడియంలోని గోడౌన్ లో భద్రపరుస్తారనీ ఆయన తెలిపారు. ఈ విషయమై ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వారి ప్రతినిధులకు వివరించగా వారు సమ్మతం తెలిపార నీ రిటర్నింగ్ అధికారి అన్నారు. పోలింగ్ లో వినియోగించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ లను ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల లోని స్ట్రాంగ్ రూములో భద్రపరిచామని, దీనిపై ఎటువంటి అపోహలు సందేహాలకు తావు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు నమ్మకూడదని ఆయన తెలిపారు .

 

 

 

Share This Post