పానుగల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సందర్శించిన జిల్లా అధికారుల బృందం

పత్రికా ప్రకటన
6. 12 .2021 .
వనపర్తి .

పానుగల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు

పర్యాటక కేంద్ర ఏర్పాటుకు అధికారుల సందర్శన

పానుగల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సోమవారం జిల్లా అధికారుల బృందం పాన్గల్ ఖిల్లాను సందర్శించారు. ఖిల్లా పై ఉన్న ఆనాటి కట్టడాలను,శిల్పాలను పరిశీలించారు..కట్టడాలు శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు..ఖిల్లా పై ఉన్న ముండ్ల గవిని, మక్కా మసీదు,,రామగుండం,సితగుండం,చిన్న ఖిల్లా,పెద్ద ఖిల్లా,,సీతారామ పాదాలు, ఫిరంగులు,ఖిల్లా చుట్టూ వున్న కంధకాలు, ముఖద్వారాలు,,తదితర వాటిని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ మంత్రి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,కలెక్టర్ యాష్మీన్ భాష గారి ఆదేశానుసారం ఖిల్లాను సందర్శించడం జరిగిందని, ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్ కు నివేదిక అందిస్తామని అధికారుల బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మునీరుద్దీన్,, అధికారులు బృందం టూరిజం అధికారి యం. ఎ. రషీద్, PR EE మల్లయ్య, ప్రత్యేక అధికారి సురేష్,DE చెన్నయ్య,AE సత్తయ్య ,తహశీల్దార్ చక్రపాణి, ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి,RI మహేష్,సర్పంచ్ గోపాల్ రెడ్డి,గ్రామ ప్రముఖులు   రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడింది.

Share This Post