పానుగల్ మండలంలో పర్యటించి, కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
29. 10 .2021
వనపర్తి

జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చేయించి టార్గెట్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష వైద్యాధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లాలోని పానుగల్ మండలంలో కలెక్టర్ పర్యటించి వ్యాక్సిన్ కేంద్రాలను గ్రామాలలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారి జాబితా తయారు చేసుకుని ఇంటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బంది, అంగన్వాడి, ఆశ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మొదటి, రెండవ డోసు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. . ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వ్యాక్సిన్ వేసుకున్న వారి పేర్లు అప్లోడ్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post