పారదర్శకంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఈ నెల 10 న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి  రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్  ఆర్.వి. కర్ణన్                      

పారదర్శకంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ

ఈ నెల 10 న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్  ఆర్.వి. కర్ణన్

000000

డిసెంబర్ 10 న కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎన్నికలను  నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై  పోలిస్ కమీషనర్ వి. సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పాత్రికేయుల సమావేశం లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 02 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10 న పోలింగ్ ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.  ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 14 న ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం నుండి డిసెంబర్ 10 పోలింగ్ ముగిసే వరకు నిశ్శబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) అని, రాజకీయ పార్టీల నాయకులు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని  ఆయన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 08 పోలింగ్ కేంద్రాలు, కరీంనగర్ జిల్లాలో 02 కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల జిల్లాలో 02 జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి జిల్లాలో 02 పెద్దపల్లి, మంథని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 01, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 01, మొత్తం 08 పోలింగ్ కేంద్రాలలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలొ నగరపాలక సంస్థలోని కార్పోరేటర్లు, మున్సిపాలిటీలలోని కౌన్సిలర్లు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 1324 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 4 గురు నిరక్షరాస్యులు ఉన్నారని, వారికి సహాయకులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రభుత్వ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్, ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల పోలింగ్ కు 36 మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ కు ఒకటే బ్యాలెట్ పేపర్ ఉంటుందని ప్రాధాన్యత క్రమంలో వారి పేర్లకు ఎదురుగా ఎన్నికల అధికరులు ఇచ్చిన ప్రత్యేక పెన్నుతో నెంబర్లు వేయాలని అన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం  అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ వర్కర్లను నియమించామని తెలిపారు. ఈ ఎన్నికలలో ఇండెబుల్ ఇంక్ ఉండదని తెలిపారు.  ఎన్నికల పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫొన్లను అనుమతించబడవని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని అన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారధర్శకంగా, పకడ్బంధీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

పోలిస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ  ఎన్నికల నిర్వహణకు 1113 మందితో పకడ్బంధీ పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో 8 రూట్లు ఉన్నాయని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి తీసుకువెళ్లే వాహనాలకు పోలిసులను ఎస్కార్టుగా పంపిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా నిర్వహించుటకు సహకరించాలని ఆయన కోరారు.

Share This Post