పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రచురణార్థం

*పారదర్శకంగా టీచర్ల బదిలీ, పదోన్నతులను చేపట్టాలి -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*

**జిల్లాలో వెంటనే టీచర్ల సీనియార్టి జాబితా, ఖాళీల వివరాలు ఆన్ లైన్ లో నమోదు*

**ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు*

**మన ఊరు మన బడి, మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి*

**టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి కార్యక్రమం పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి*
—————————–
పెద్దపల్లి, జనవరి – 27:
—————————-
రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి టీచర్ల బదిలీ పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలు అంశాల పై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పాల్గొన్నారు.

*రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,* ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినితికి తావు లేకుండా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలు లేదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సీనియార్టి జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో ప్రదర్శించాలని, వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని తెలిపారు.

జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్ లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్ లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

*రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ,* టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరిగేలా కలెక్టర్ లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలని, 2 రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ ను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని సూచించారు.

మన ఊరు మనబడి క్రింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం నిర్వహించాలని తెలిపారు.

*వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ,* జిల్లాలో ఎంపిక చేసిన 28 మోడల్ మన ఊరు మన బడి పాఠశాలల్లో 21 పాఠశాలల పనులు సంపూర్ణంగా పూర్తి చేసామని, 7 పాఠశాలల్లో ఎన్.ఆర్.ఈ.జి. ఎస్. పనులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల కోసం సీనియార్టి జాబితా, ఖాళీల జాబితాను సమర్పించామని, సదరు జాబితాను జిల్లా వెబ్ సైట్ లో కూడా పొందుపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ఈఈ ఆర్ అండ్ బీ నరసింహాచారి, మండల విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం పెద్దపల్లి చే జారీ చేయనైనది

Share This Post