పారదర్శకంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—1

తేదీ.22.4.2022

పారదర్శకంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ :: జిల్లా కలెక్టర్ జి.రవి

మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు

• 10వ తరగతి పరీక్షలకు 67 కేంద్రాల ఏర్పాటు

• మే 23,2022 నుంచి జూన్ 01,2022 వరకు 10వ తరగతి పరీక్షలు

• 10వ తరగతి పరీక్షల నిర్వ హణ పై కలెక్టర్ సమీక్ష

జగిత్యాల, ఏప్రిల్ 22:- జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.10వ తరగతి పరీక్షల నిర్వహణ పై శుక్రవారం పొన్నాల గార్డెన్స్ లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం 10వ తరగతి పరీక్షల నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మే23 నుంచి జూన్ 01,2022 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు 67 కేంద్రాలను సిద్ధం చేయాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు.

గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షల నిర్వహించలేదని, ప్రస్తుత సంవత్సరం విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం అవ్వడానికి అధిక సమయం కేటాయించి, సిలబస్ తగ్గించి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ మాసం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నామని, దీనికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. 10వ పరీక్షలకు మరో నెల రోజులు సమయం ఉందని, సంపూర్ణంగా వినియోగించుకోవాలనే కలెక్టర్ సూచించారు.

పాఠశాలలో వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి, ఉపాధ్యాయులు వారి పై అధిక శ్రద్ధ వహించాలని, అధిక సమయం వారు ముఖ్యమైన పాఠ్య అంశాలను రాసే విధంగా చూడాలని, విద్యార్థులకు అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించి సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పదవతరగతి పరీక్షల్లో జిల్లాకు స్థానం సాధించేందుకు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ పాల్పడడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ అధికంగా జరిగే కేంద్రాల్లో స్వయంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.

విద్యార్థులు సోంతంగా పరీక్షలకు చదువుకొని, వారి శ్రమతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందకు అవసరమైన ప్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర ఇన్విజిలేటర్ల ను నియవించి పరీక్షలు సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన వైద్య బృందాన్ని నియమించాలని, వేసవి దృష్టిలో ఉంచుకొని వారి వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 67 పరీక్ష కేంద్రాల్లో ప్రతి తరగతిలో విద్యార్థులు సౌకర్యార్థం కోసం తప్పనిసరిగా డెస్క్, ఫ్యాన్ , నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించిందని, జగిత్యాల జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలలను ఎంపిక అయ్యాయని కలెక్టర్ తెలిపారు.

60 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఫోటో అప్ లోడింగ్, ఎంఓయూ కాపీ డౌన్లోడ్ చేసి తీర్మానం చేయడం వంటి పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని, మండల విద్యాశాఖ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా విద్యా శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయనైనది.

ప్రచురణార్థం---1 తేదీ.22.4.2022 పారదర్శకంగా  పదవ తరగతి పరీక్షల నిర్వహణ ::  జిల్లా కలెక్టర్ జి.రవి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు • 10వ తరగతి పరీక్షలకు 67 కేంద్రాల ఏర్పాటు •	మే 23,2022 నుంచి జూన్ 01,2022 వరకు 10వ తరగతి పరీక్షలు •	 10వ తరగతి పరీక్షల నిర్వ హణ పై కలెక్టర్ సమీక్ష జగిత్యాల, ఏప్రిల్ 22:- జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.10వ తరగతి పరీక్షల నిర్వహణ పై శుక్రవారం పొన్నాల గార్డెన్స్ లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   ప్రభుత్వ నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం 10వ తరగతి పరీక్షల నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మే23 నుంచి జూన్ 01,2022 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు 67 కేంద్రాలను సిద్ధం చేయాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షల నిర్వహించలేదని, ప్రస్తుత సంవత్సరం విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం అవ్వడానికి అధిక సమయం కేటాయించి, సిలబస్ తగ్గించి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ మాసం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నామని, దీనికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. 10వ పరీక్షలకు మరో నెల రోజులు సమయం ఉందని, సంపూర్ణంగా వినియోగించుకోవాలనే కలెక్టర్ సూచించారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి, ఉపాధ్యాయులు వారి పై అధిక శ్రద్ధ వహించాలని, అధిక సమయం వారు ముఖ్యమైన పాఠ్య అంశాలను రాసే విధంగా చూడాలని, విద్యార్థులకు అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించి సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పదవతరగతి పరీక్షల్లో జిల్లాకు స్థానం సాధించేందుకు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ పాల్పడడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ అధికంగా జరిగే కేంద్రాల్లో స్వయంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులు సోంతంగా పరీక్షలకు చదువుకొని, వారి శ్రమతో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందకు అవసరమైన  ప్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని,  అవసరమైన మేర ఇన్విజిలేటర్ల ను నియవించి పరీక్షలు సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన వైద్య బృందాన్ని నియమించాలని, వేసవి దృష్టిలో ఉంచుకొని వారి వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 67 పరీక్ష కేంద్రాల్లో ప్రతి తరగతిలో విద్యార్థులు సౌకర్యార్థం కోసం తప్పనిసరిగా డెస్క్, ఫ్యాన్ , నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని కలెక్టర్ సూచించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించిందని, జగిత్యాల జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలలను ఎంపిక అయ్యాయని కలెక్టర్ తెలిపారు. 60 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఫోటో అప్ లోడింగ్, ఎంఓయూ కాపీ డౌన్లోడ్ చేసి తీర్మానం చేయడం వంటి పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని, మండల విద్యాశాఖ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.  	 జిల్లా విద్యా శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి,  సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.  జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయనైనది.
పారదర్శకంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ :: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post