DPRO ADB – పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మద్యం దుకాణాల కేటాయింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా కేటాయింపులు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున ఆబ్కారీ పర్యవేక్షక కార్యాలయంలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ స్టేషన్ల పరిధిలోని దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు 364 దరఖాస్తులు రావడం జరిగిందని, ఇంకా దరఖాస్తులు సమర్పించడానికి చాల మంది ఉన్నారని వారందరి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20 తేదీన మద్యం దుకాణాల కేటాయింపులను స్థానిక తానిషా గార్డెన్ లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చలానా, డిమాండ్ డ్రాఫ్ట్ ల ద్వారా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజులు దరఖాస్తు దారులు చెల్లించడం జరుగుతున్నది తెలిపారు. మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాల నుండి కూడా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. అంతకుముందు వివిధ కౌంటర్ లలో దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ పర్యవేక్షకులు రవీందర్ రాజు, సిఐ శ్రీనివాస్, ఇతర ఆబ్కారీ శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Share This Post