పారదర్శకంగా లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

నూతన ఏక్సైజ్ పాలసీ 2021- 23 వైన్ షాపుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా  లాటరీ పద్ధతి ద్వారా దుకాణాల కేటాయింపులు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున  స్థానిక తానిషా గార్డెన్ లో ఎక్సయిజ్ శాఖ కమీషనర్ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని ఆదిలాబాదు, ఇచ్చోడ, ఉట్నూర్ స్టేషన్ ల పరిధులలోని 40 దుకాణాలకు 591 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ స్టేషన్ తదుపరి ఇచ్చోడ స్టేషన్, ఆ తర్వాత ఉట్నూర్ స్టేషన్ ల పరిధిలలోని దరఖాస్తులను దుకాణాల వారీగా లాటరీ పద్దతి ద్వారా ఎంపికను అందరి సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ అధికారి రవీందర్ రాజు మాట్లాడుతూ, డైరక్టర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారి ఆదేశాల మేరకు ఆదిలాబాదు స్టేషన్ పరిధిలోని గెజిట్ నెం. 16, 17, ఇచ్చోడ స్టేషన్ పరిధిలోని గెజిట్ నెం. 31 దుకాణాల కేటాయింపులు నిలిపి వేయాలని ఆదేశించిన మేరకు ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆయా దుకాణాలకు తక్కవ దరఖాస్తులు రావడం వలన నిలిపివేయాలనే అదేశాల ప్రకారం నిలిపివేశామని తెలిపారు. తదుపరి ఆదేశాల ప్రకారం చర్యలు తీసు కోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏక్సైజ్ శాఖ సహాయ కమీషనర్ ఏ.గణేష్, సిఐ లు, ఎస్సైలు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.  DSP వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.

Share This Post