పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాష

పత్రికా ప్రకటన
తేదీ 01.08.2022, వనపర్తి.

పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ ఆయా శాఖలకు బదలాయింపు జరిగిందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా సూచించారు.
సోమవారం ఐ.డి. ఓ.డి. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను డ్రా పద్దతిలో కేటాయింపులు జరిగినట్లు ఆమె సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వులు జి. ఓ. నెం. ms. NO.121,
తేదీ :23.07.2022,  సర్క్యులర్ మెమో. నెం.1634052-B/186/A1/HRM /VII /2022, తేది :26.07.2022 ప్రకారం శాఖల వారిగా జిల్లాలో మొత్తం (91) మందికి (26) శాఖల్లో సర్దుబాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్భాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——–
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post