*పారిశుద్ద్యం, పచ్చదనం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి*

ప్రచురణార్థం—-3

తేదీ.13.12.2021

*పారిశుద్ద్యం, పచ్చదనం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి*
*పారిశుద్ద్యం, పచ్చదనం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి*

జగిత్యాల, డిసెంబర్ 13:- జిల్లా అధికారులు పారిశుద్ద్యం, పచ్చదనం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ జి.రవి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధించిన అధికారులతో వివిధ శాఖల పెండింగ్ సమస్యల పై సమన్వయ (కన్వర్జెన్సీ) సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పొరపాట్లు లేకుండా సరయిన నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలో హరితహారంలో నాటిన మొక్కలు రీప్లేస్మెంట్ చేసి పచ్చదనంగా కనపడేలా చూడాలని, అదేవిధంగా పారిశుద్ధ్యం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్లాస్టిక్ నిర్మూలించే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కమీషనర్లు పట్టాణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా తనిఖీలు నిర్వహించాలని, గ్రామపంచాయితిలలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ సీజ్ చేసి ,పెనాల్టీలు విధించి ఇకముందు ప్లాస్టిక్ ను వాడకుండా చూడడంతో పాటు, జూట్ బ్యాగులను వాడకాన్ని పెంచేలా డిఆర్డిఏ వివిధ సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కోన్నారు.

అధికారులు ప్రభుత్వ లక్ష్యాల ప్రగతిని సాధించాలని, ప్రభుత్వ కార్యాలయాలలో చెత్తచేదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పనిచేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామని పేర్కోన్నారు. నెలలో ఒకరోజు (మూడవ శనివారం) ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. టిఎస్ బి పాస్ ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు జరిగేలా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి పర్యవేక్షించి, చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో కూడా ఆదేశాల మేరకు మాత్రమే నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణాల కొరకు ఇచ్చే అనుమతులు అధికారులు పరిశీలించాలని అన్నారు.ఎస్సి, ఎస్టీ ఋణాలను సకాలంలో అందించేలా చూడాలని ఆదేశించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ లో అలస్యం కాకుండా, సకాలంలో పూర్తి చేయాలని అన్నారు, జిల్లాలో 3 నుండి 4 వేల వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికి పాజిటివ్ కేసుల నమోదు అంతకంతకు తగ్గిపోయినప్పటికి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజు RTPCR, ర్యాపిడ్ పరీక్షల నివేధికలను ప్రతిరోజు అందించాలని, ఒమిక్రాన్‌ వైరస్ ప్రబావం లేకుండా ప్రజలు సామాజిక దూరం పాంటించడం, మాస్కులను దరించడం వంటి జాగ్రత్తలను పాటించేలా చూడాలని అన్నారు. స్థిర, చర ఆస్థుల వివరాలను అందించాలని, పనికి రాకుండా ఖండేం చేయాల్సిన వాహనాల వివరాలను అందించాలని, శాఖల వారిగా అవుట్ సోర్స్ సిబ్బంది వివరాల నివేధికను పంపించాలని, ఇస్రామ్ ఫోర్టల్ లో అసంఘటిత రంగాలలో పనిచేసే కూలీల వివరాలను నమోదు చేయించడం వారికి అవగాహన కల్పిస్తూ, అక్కడిక్కడే నమోదు చేయించేలా చూడాలని పేర్కోన్నారు.

దాన్యం కొనుగోలును ప్రత్యేక అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, లోడింగ్ అన్ లోడింగ్ ఇబ్బందులు లేకుండా చూస్తూ తోరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

Share This Post