పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందాల టీములు సోమవారం నాడు గుండాల మండలం టి.షాపూర్, ఆత్మకూరు మండలం పారుపల్లి, రామన్నపేట మండలం మునిపంపుల, పుట్టపాక, ఆలేరు మండలం టంగుటూరు, షారాజిపేట గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి ఇద్దరు బృంద సభ్యుల చొప్పున పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించింది.

స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్, డంపింగ్ యార్డులు, తడి చెత్త, పొడి చెత్త ద్వారా ఎరువుల తయారీ, వైకుంఠ ధామాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం తదితర కార్యక్రమాలను, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ పట్ల పరిశీలన జరిపింది.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సంబంధిత ఎంపీడీవో, మండల స్పెషల్ ఆఫీసర్స్, ఏపీవో,  పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు.

Share This Post