పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహించవద్దు :: జిల్లా కలెక్టర్ జి.రవి

పత్రికాప్రకటన..2 తేదిః 21-09-2021
పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహించవద్దు :: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, సెప్టెంబర్ 21:- మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి.రవి హెచ్చరించారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్యం, వివిద అభివృద్ధిపనులు, ఇంజినీరింగ్ పనులు, పట్టణ ప్రగతి , హరితహారం, నిధుల వినియోగం, పై కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో సమిక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల మున్సిపాలిటీ లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా కార్మికుల నియామకం, అదనపు వాహనాల కోనుగోలు చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మెరుగు పడకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని, ప్రతి రోజు2 సార్లు హజరు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంగా ఉన్నందున ఎక్కువ ఫోకస్ ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. గత అధికారులు, సిబ్బంది సరిగా పని చేయనందున ఇటీవల కొత్త వారిని నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీ పారిశుద్ధ్యంలో చెడ్డ పేరు వచ్చిందని, దానిని సరి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో 294 పారిశుద్ధ్య కార్మికులు, అదనంగా నూతన వాహనాల వంటి అన్ని వసతులు అందించినప్సపటీకి వైఫల్యం కావడం చాలా బాధాకరమని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది జీతాలు బయో మెట్రిక్ ద్వారా తీసుకునే అటెండెన్స్ ఆధారంగా అందించాలని, పని చేయని వారికి జీతాలు కోత విధించాలని ఆదేశించారు. నూతనంగా కోనుగోలు చేసిన వాహనాలు మరమ్మతులు, సర్వీసింగ్ లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొన్ని వాహనాలుకు ఇంకా రిజిస్ట్రేషన్ చేయక పోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డ్రైవర్లు సక్రమంగా విధులకు హాజరు కాకపోతే వారిని తొలగించి వేరే వారిని నియమించుకోవాలని తెలిపారు. పనుల్లో శ్రద్ద చూపకపోతే విధుల నుండి తొలగిస్తామని హెచ్చరించారు.చెత్త సేకరణ చేసే వాహనాలకు జి.పి.ఎస్. సిస్టెంల ద్వారా డీజిల్ ఖర్చులు ప్రతి నెల అంచనా వేయాలి, డైలీ లాగ్ బుక్ లు కమిషనర్ కి అందచేయాలని తెలిపారు. చెత్తను తిమ్మాపూర్లో మాత్రమే డంప్ చేయాలని, రోడ్ల, కాలువలో చెత్త వేసే వారి పై భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంచి మొక్కలు పెట్టి రంగు, రంగు, ట్రీ గార్డులు, ట్రాఫిక్ ఐ ల్యాండ్స్ , ముఖ్య కుడాల్లో సుందరంగా తీర్చి దిద్దాలని కలెక్టర్ తెలిపారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. హరితహారంలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ సెక్రటరీ లను, సర్పంచులుకు షోకాజ్ నోటీస్ జారి చేసి కొందరిని సస్పెండ్ చేయడం జరిగిందని కాబట్టి దీనిని గమనించి ప్రత్యేక శ్రద్ధ వహించి పని చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. టీబీ పాస్ ద్వారా నూతన భవన నిర్మాణ అనుమతులు సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు . మున్సిపల్ పన్ను వసూలు, ఇంటి పన్ను కమర్షియల్ పనులు, షాపు లైసెన్స్ వసూలు పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వానికి వస్తున్న రెంట్లు నిరంతరం పరిశీలించి అవసరమైన స్థాయిలో పెంచాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అంశంలో వైఫల్యం చెందారని, దీనిని సరిచేసుకోవాలని, పనుల్లో మార్పు రావాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని, వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయిస్తూ వసతులు కల్పిస్తూ నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ లో వైఫల్యం చెందడం ద్వారా ప్రజలకు అవస్థలు వస్తున్నాయని, దీనిని వెంటనే మార్చుకోవాలని అలసత్వం లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. హరితహారంలో భాగంగా ఏ ఏ వార్డుల్లో ఎన్ని మొక్కలు , పెట్టారు వాటికి ఎంత ఖర్చు చేశారు వంటి అంశాలపై ప్రతి 10 రోజులకు ఒక సారి వార్డ్ మెంబర్ లతో సమావేశం నిర్వహించుకొని ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అధిగ మించాలని ఎం.ఎల్.ఏ. అన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ జె. అరుణశ్రీ

పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహించవద్దు :: జిల్లా కలెక్టర్ జి.రవి

, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయడమైనది

Share This Post