పారిశుధ్య కార్యక్రమాలు మిషన్ మోడ్ లో చేపట్టండి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 27, 2021ఆదిలాబాదు:-

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రగతి సాధించాలని, తద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం, ఎవెన్యూ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ఉపాధి హామీ కూలీల పెంపు, పారిశుధ్య కార్యక్రమాలపై ఎంపీడీఓ లు, ఎపిఓలతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా 43 లక్షల 64 వేల 500 మొక్కలు నాటాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 42 లక్షల 95 వేల 225 మొక్కలు నాటి 98.42 శాతం ప్రగతి సాధించామని తెలిపారు.  నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మల్టి లేయర్ ప్లాంటేషన్ పనులు వెంటనే పూర్తీ చేయాలనీ, బృహత్ పల్లె పకృతి వనాలకు గుర్తించబడిన భూములలో గుంతలు తవ్వి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని, పంచాయితీ కార్యదర్శులు గ్రామాలలోని పనులను పర్యవేక్షించాలని సూచించారు. వర్షాకాలం సందర్భంలో పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి కాలువల లోని చెత్తను తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా రసాయనాలు, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు సెప్టెంబర్ ఒకటి నుండి పునః ప్రారంభం అవుతున్నందున, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరచే విధంగా పంచాయితీ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంపీడీఓ లు టీమ్ లను ఏర్పాటు చేసి పాఠశాలలను, అంగన్వాడీ లను పరిశీలించి ఈ నెల 30 తేదీన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని అన్నారు. జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లో మండల, గ్రామ స్థాయి అధికారులకు జారీ చేసే ఆదేశాలు, సూచనలు పంచాయితీ కార్యదర్శులకు వెళ్లే విధంగా చూడాలని సూచించారు. ముఖ్యంగా అర్బన్, సెమి అర్బన్ ప్రాంతాల్లో శానిటేషన్ వలన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమంలో మొక్కల పెంపకం సవ్యంగా జరగాలని, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో పిచ్చి మొక్కలను తొలగించి, భూమిని చదును చేసి గుంతను తవ్వి మొక్కలను నాటాలని అన్నారు. ఎవెన్యూ, మల్టి లేయర్ ప్లాంటేషన్ పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తీ చేయాలనీ అన్నారు. మల్టి లేయర్ ప్లాంటేషన్ పూర్తీ చేయాల్సిన బాధ్యత ఎపిఓ లపై ఉందని అన్నారు. ఉపాధి హామీ కూలీలను మొబలైజ్ చేసి ప్రతి గ్రామపంచాయితీ లో 15 మందికి తక్కువ కాకుండా కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. ఎపిఓ లు క్షేత్ర పర్యటన తప్పని సరిగా నిర్వహించి మస్టర్ లను పరిశీలించాలని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం దృష్ట్యా ఎంపీడీఓ లు పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ విద్యాలయాలు కాకుండా ప్రయివేట్ విద్యాలయాలు కూడా పరిశీలించి పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. తరగతి గదులు, టాయిలెట్స్ లను శుభ్రపరచాలని అన్నారు. ముఖ్యంగా బాలికల టాయిలెట్స్ లలో తప్పనిసరిగా తలుపులు ఉండే విధంగా చూడాలని అన్నారు. మండలాల వారీగా నివేదికలు సమర్పించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. పంచాయితీ కార్యదర్శులు నిర్ణిత సమయంలో విధులు నిర్వహించే విధంగా పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జడ్పీ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, ఎంపీడీఓ లు, ఎపిఓ లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post