పాలకుర్తి నియోజకవర్గం డబుల్ బెడ్రూం పనుల ప్రగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

పాలకుర్తి నియోజకవర్గం డబుల్ బెడ్రూం పనుల ప్రగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

పాలకుర్తి నియోజకవర్గం డబుల్ బెడ్రూం పనుల ప్రగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఏప్రిల్ -29:

పాలకుర్తి నియోజకవర్గం డబుల్ బెడ్రూం పనుల ప్రగతిని జిల్లా కలెక్టర్ కె. శశాంక సమీక్షించారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు, పెద్ద వంగర మండలంలో నిర్మిస్తున్న ఫేస్ -1, ఫేస్ -3 డబుల్ బెడ్ రూం నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 75 శాతం పనులు ఫిజికల్ గా పూర్తి అయిన తర్వాతనే గ్రామసభ నిర్వహించాలని, ఇరిగేషన్ కు సంబందించి ఫేస్-1, ఫేస్ -3 పనులు వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.

ఎండాకాలం దృష్ట్యా జూన్ 30 లోగా ఎక్స్టర్నల్ పనులు పూర్తి చేసుకోవాలని, వర్షాకాలం మొదలైన తర్వాత ఇంటర్నల్ పనులు చేయాలని తెలిపారు.

అన్ని ఇళ్లకు కలిపి సెప్టిక్ టాంక్, సంప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్లాకుల మధ్య ఇంటర్నల్ రోడ్లు వేయాలని తెలిపారు.

త్రాగునీటి, సెప్టిక్ ట్యాంక్, విద్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లబ్దిదారులు ఎంపిక అయిన తర్వాత విద్యుత్ సౌకర్యం కోసం దరఖాస్తు చేయించాలని తెలిపారు.

తొర్రూరు లో 1091, పెద్ద వంగర లో 595 మొత్తం 1686 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు గానూ, మొత్తం 542 పూర్తి కాగా, 325 ఇల్లు లబ్దిదారులకు అందించడం జరిగిందని, 217 ఇల్లులు గ్రామసభలు నిర్వహించి అందజేయవలసి ఉందని, మిగతా పనులు వివిధ స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో తొర్రూరు ఆర్డీవో రమేష్, ఇరిగేషన్ ఈఈ. , TSWIDC ఈ. ఈ., తహశీల్దార్ రాఘవ రెడ్డి, ఎంపిడిఓ., తొర్రూరు మునిసిపల్ కమిషనర్, 2BHK ఏజెన్సీలు, కలెక్టరేట్ కార్యాలయ సెక్షన్ సూపరింటెండెంట్ సదానందం, తదితరులు పాల్గొన్నారు.

—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post