పాలకుర్తి – బమ్మెర – వల్మిడి కారిడార్ పనుల ప్రగతి పై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

ప్రచురణార్దం-1

అనంతరం పాలకుర్తి, వల్మీడిలో జరుగుతున్న ఆయా అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు.

పాలకుర్తి లో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణాన్ని చూశారు.

వల్మీడి గుట్ట మీద పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ల కు తగు సూచనలు చేశారు.

పనులను నిర్ణీత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని అదేశించారు.

అయా పనుల ప్రస్తుత ప్రగతి పై సీఎం గారికి పూర్తి సమాచారం అందే విధంగా నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,

సోమేశ్వర స్మారక స్థూపం, కళ్యాణ మండపం, గుట్ట పైన గిరి ప్రదక్షిణ, ఆలయ ఆధునీకరణ పనుల పై మంత్రి సమీక్షించారు. సోమనాథ స్మారక భవనం, కళ్యాణ మండపం, విద్యుదీకరణ, నీటి వసతి ఏర్పాట్లను మంత్రి సమీక్షించి తగు సూచనలు చేశారు. అలాగే. బమ్మెర లో నిర్మాణం లో ఉన్న పలు పనులు మంత్రి సమీక్షించారు. అక్షరాభ్యాస మందిరం, కళ్యాణ మండపం, వల్మిడి లో దేవాలయ ప్రధాన ఆలయం, వడుడికరణ, పాకశాల, రోడ్డు పనులను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పనులను వేగం చేయాలన్నారు.
కాగా,
ప్రభుత్వం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం- బమ్మెర పోతన స్మారక మందిరం – వల్మీడి శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది.

గతంలో సీఎం కెసిఆర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పాలకుర్తి కి 10 కోట్లు, బమ్మెర కు 7.50 కోట్లు, వల్మీడీ కి 5 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే

జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post