పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

ప్రచురణార్దం-2
జనగామ డిసెంబర్ 10;
శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రములోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ సిహెచ్.శివలింగయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు సిబ్బంది కలెక్టర్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
జిల్లా కలెక్టర్ స్వామి వారికి అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. ఆలయంలో
జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామన్న, శర్మ, ఈఓ బి. లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post