పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ : జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డి.ఐ.జి.ఏ.వి.రంగనాథ్

పత్రికా ప్రకటన          తేది:10.08.2021, నల్గొండ.

ప్రశాంతంగా ముగిసింది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ #

అభిప్రాయాలను తెలిపిన ల్ 23 మంది ప్రజలు,ప్రజా ప్రతినిధులు, ఎన్. జి.ఓ.లు. * ప్రాజెక్ట్ రెండో దశ లో జిల్లాలో కాలువల నిర్మాణం పట్ల ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం కొండ మల్లెపల్లి,ఆగస్ట్ 10. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం కెనాల్ నెట్వర్క్ 2 వ దశ నల్గొండ జిల్లా కొండ మల్లే పల్లి మండలం లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది.మంగళవారం కొండమల్లే పల్లి జనప్రియ గార్డెన్స్ లో సోమవా రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ.వి.రంగనాథ్,పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సి.ఈ. హమీద్ ఖాన్,ఈ ఈ రవీందర్, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ రాజేందర్,దేవరకొండ ఆర్.డి.ఓ. గోపిరాం, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనాల్ నెట్వర్క్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లో ప్రజలు,ఎన్. జి.ఓ.లు,ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలుపవచ్చని, సలహాలు,సూచనలు,అభిప్రాయాలను రాత పూర్వకంగా కూడా అంద చేయవచ్చని తెలిపారు. పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఈ ఈ రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా పునర్విభ జించిన మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,నారాయణ పేట,రంగా రెడ్డి,వికారాబాద్, నల్గొండ జిల్లా లు కరవు ప్రాంత జిల్లా లలో వలసలు నివారించి సాగు,త్రాగు నీరు అందించేందుకు పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టి నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాల నుండి 90 టి.యం.సి.ల నీటిని 60 రోజులలో తోడి 5 దశలలో ఎత్తి పోసి 6 రిజర్వాయర్ లు నింపి 6 జిల్లాల్లోని 70 మండలాల్లో 12,30,000 ఎకరాలకు సాగు నీరు ,1226 గ్రామాలకు త్రాగు నీరు,పరిశ్రమలకు నీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ ను రెండు దశలలో చేపట్టనున్నట్లు ,ప్రాజెక్ట్ మొదటి దశలో త్రాగు నీటి వినియోగం, పారిశ్రామిక అవసరాలు,సాగు నీటికి అవసరమైన లిఫ్టింగ్,నిల్వకు సంబంధించి ప్రాథమికంగా అప్రోచ్ చానల్స్,ఓపెన్ కెనాల్స్(50.490 కి.మీ),సొరంగాలు(61.577 కి.మీ),పంపు హౌజ్ లు (5), అంజన గిరి,వీరంజనేయ,వెంకటాద్రి,కురుమూర్తి రాయ,ఉదండా పూర్, కె.పి.లక్ష్మీ దేవి పల్లి మొత్తం 6,(67.97 టి.యం.సి.నిల్వ చేసే సామర్థ్యము కలవి) నిర్మాణ పనులు ఉంటాయని తెలిపారు. ప్రాజెక్ట్ రెండో దశలో వెంకటాద్రి, కురుమూర్తి రాయ,ఉదండా పూర్,కె.పి.లక్ష్మీ దేవిపల్లి రిజర్వాయర్ ల ద్వారా 12,30,000 ఎకరాలకు సాగు నీరు అందించేలా 13 ప్రధాన కాలువలు,మొత్తం 915 కి.మీ. పొడవు, డిస్ట్రిబ్యూటరి నిర్మాణం పనులు ఉంటాయని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ కింద మర్రి గూడ,చింత పల్లి మండ లాల్లో ని 16 గ్రామాల్లో వెంకటాద్రి, కె.పి.లక్ష్మీ దేవి పల్లి రిజర్వాయర్ ల ద్వారా వచ్చే కాలువల ద్వారా సుమారుగా 29,339 ఎకరాల్లో సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు.నల్గొండ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు కాలువల నిర్మాణానికి సుమారుగా 494 ఎకరాల భూమిని సేకరించ నున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెజ్ట్ వినియోగం లోకి వచ్జిన తర్వాత భూ గర్భ జలాలు పెరగడం,అదనంగా నీటి సామర్థ్యము, ఆయకట్టు ప్రాంతం లోని రైతుల జీవన ప్రమాణాల్లో మెరుగుదల,ప్రాజెక్ట్ పనులు,మత్స్య సంపద ద్వారా ఉద్యోగ అవకాశాలు,పశువుల పెంపకం, వినోదం పర్యాటకం,ఆర్థిక,వాణిజ్య ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు మెరుగైన రీతి లో అందుబాటులో వుంటాయని అన్నారు.ఆయకట్టు కాలువల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతి అవసరం ఉందని,కావున పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లో ప్రజల అభిప్రాయాలు తెలపాలని అన్నారు.పర్యావరణ కన్సల్ టెంట్ పర్యావరణ భద్రతా, నిర్మాణ పర జాగ్రత్తలు వివరించారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ లో 23 మంది ప్రజలు,ప్రజా ప్రతినిధులు, ఎన్. జి.ఓ.లు తమ అభిప్రాయాలు తెలిపారు.వారు ప్రాజెక్ట్ లో భాగంగా కాలువలు నిర్మాణం వలన ఈ ప్రాంతం కు మంచి జరుగుతుందని,ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.భూ నిర్వాసితుల కు నష్ట పరిహారం అందించాలని,మార్కెట్ విలువ ప్రకారం అందించాలని, తొందరగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని అభిప్రాయం తెలిపారు.

…………………….

డి.పి.ఆర్.ఓ. నల్గొండ ద్వారా జారీ చేయబడినది.

Share This Post