పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హన్వాడ మండలం లోని ప్రతి గ్రామ చెరువును సాగునీటితో నింపుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

పత్రికా ప్రకటన                                       మహబూబ్ నగర్
27. 7. 2021
___________
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హన్వాడ మండలం లోని ప్రతి గ్రామ చెరువును సాగునీటితో నింపుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఆయన హన్వాడ తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో 79 మంది లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులను పంపిణీ చేశారు .
మండలంలోని హేమసముద్రం చెరువు ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా కొత్తగా 4 వేలకు పైగా ఆహారభద్రత కార్డులను పంపిణీ చేస్తున్నామని, మిగిలిపోయిన వారికి కూడా కార్డులు ఇస్తామని, చౌక దర దుకాణ డీలర్ల కమిషన్ ను ,దుకాణాలను ప్రభుత్వం పెంచనుందని, అదేవిధంగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రాసెస్ చేస్తున్నామని, గతంలో హన్వాడ మండలం కరెంటు కు, తాగు నీటికి అనేక కష్టాలు ఎదుర్కొన్నదని, ప్రస్తుతం ఉచిత విద్యుత్ తో పాటు ,వ్యవసాయపెట్టుబడి, మిషన్ భగీరథ నీరు ,కల్యాణలక్ష్మి, చెరువులలో పూడికతీత, ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, నర్సరీ వంటివి ఏర్పాటు చేశామని అన్నారు.కరోన సందర్భంగా హన్వాడ మండలాన్ని ఒక్క కేసు కూడా లేని మండలంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
కరివెన రిజర్వాయర్ నుండి మండలంలోని చెరువులకు సాగునీరు అందిస్తున్నామని, టంకర నుండి గుడిమల్కాపూర్ వరకు బి టి రహదారి నిర్మాణం చేపట్టామని ,మండల కేంద్రంలో రైతు బజార్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతు బజార్ పనులను కాంట్రాక్టర్ వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో స్లాటర్ హౌస్, మినీ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని, అధికారులు, రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేస్తే ప్రగతి దానంతట అదే వస్తుందని అన్నారు .ప్రతి పనిని ప్రజల కోసం చేయాలని, హన్వాడ మండలానికి ఫుడ్ పార్క్ కూడా తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పథకాలన్నీ పేదలకు వెళ్లేలా చూడాలని, మండలంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యల పట్ల ముందుండాలని,ఇండ్లు పూర్తి అయిన చోట కొత్త ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు .
ప్రతి గ్రామంలో 2014 తర్వాత చేసిన పనుల పై ఒక చార్ట్ రూపంలో ఫ్లెక్సీ తయారుచేసి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మాట్లాడుతూ హన్వాడ అభివృద్ధికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని కోరారు.
దళిత సాధికారత పథకాన్ని అమలు చేయనున్నందుకు గాను టి ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి జంబులయ్య తదితరులు మంత్రిని గజమాలతో సత్కరించారు.
కాగా మండలంలో కొత్తగా 79 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మండల కార్యాలయ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాక మొక్కలు నాటారు

ఆర్డిఓ పద్మశ్రీ, ఎంపీపీ బాల రాజ్ గౌడ్, సర్పంచ్ రేవతి, తాహసిల్దారు బక్క శ్రీనివాసులు, ఎంపిడిఓ ధనుంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి ఏన్జీవో ఫౌండేషన్ ద్వారా లబ్ది దారులకు నిత్యావసర సరుకులను అందజేశారు
____________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచారశాఖ, మహబూబ్ నగర్

 

Share This Post