పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రెండవ కెనాల్ ఏర్పాటు పై పర్యావరణ అనుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమము ప్రశాంతముగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు.

పత్రిక ప్రకటన

తేది: 10-8-2021

నారాయణపేట జిల్లా

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రెండవ కెనాల్ ఏర్పాటు పై పర్యావరణ అనుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమము ప్రశాంతముగా ముగిసినట్లు  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి  తెలిపారు.  మంగళవారం ఉదయం స్తానిక  అంజన గార్డెన్  ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన  ప్రజాభిప్రాయ సేకరణ  కార్యక్రమానికి 9 మండలాల నుండి రైతులు వచ్చి ప్రాజెటు ఏర్పాటు విషయంలో పర్యావరణానికి సంబంధించిన  తమ అభిప్రాయాలను తెలియజేసారు.  రైతులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వెలువరిచిన వారి అభిప్రాయాలు వీడియో రికార్డింగ్ చేయించడం జరిగిందని,  వీటితో పాటు కొందరు   లిఖిత పూర్వకంగా ఇచ్చిన వారి అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలియజేసారు.

అంతకన్నా ముందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, ప్రజలకు కన్సెల్టెంట్ అరవింద్ దుబే, డి.ఇ ఇరిగేషన్ విజయేందర్ రెడ్డి  ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల  రెండవ ఫేజ్ కెనాల్ ఏర్పాటు ఆవశ్యకత, అందుకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టు ఏర్పాటు  ద్వారా  లాభాలు, ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల  ఏర్పడే పర్యావరణ నష్టం తదితర అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు.  యల్.ఇ.డి. ప్రొజెక్టర్ పై పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ద్వారా  తెలుగులో పూర్తి వివరాలు గణాంకాలతో  సహా వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుండి రిజినల్ ఆఫీసర్ కుమార్ పాఠక్,   సైంటిస్ట్ భాస్కర్ రెడ్డి, ఇర్రిగేషన్ నుండి  పర్యవేక్షణ ఇంజినీర్ మక్తల్ శివధర్మ తేజ,  కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్. దయానంద్,  అరవింద్ దుబే, అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి, సంబంధిత  అధికారులు, రైతులు, ప్రజాసంఘాల నాయకుల తదితరులు హాజరయ్యారు.

————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి, నారాయణ పేట  జిల్లా ద్వారా జారి

Share This Post