జిల్లా కేంద్రంలోని ఓవర్‌బ్రిడ్డిపై పిడుగుపడి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రకృతి వైపరీత్యాల క్రింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓవర్‌బ్రిడ్జిపై పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు మృతి చెందగా తీవ్ర గాయాలైన తండ్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సoదర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌తో కలిసి ఆనుపత్రికి చేరుకున్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదం జరుగడం విచారకరమని, చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని తహశిల్దార్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆనుషత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్, మంచిర్యాల తహశిల్దార్ రాజేశ్వర్, సoబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.