పిల్లలకు గుణాత్మక విద్యానందించాలి. పాఠశాలను పరిశుభ్రఅంగా ఉంచాలి. భోజన మెనూ పరిశీలన.::::: అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

పిల్లలకు గుణాత్మకమైన విద్యానందించాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ను ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని ఆదిశగా విద్యార్థులకు నాణ్యమైన విద్యన దించాలని సూచించారు. పిల్లలు తరగతులకు తప్పక హాజరు అయ్యే విదంగా  వారికి అర్ధమైయ్యే విదంగా  తరగతులను నిర్వహించాలని సూచించారు. కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలుపుతూ   విద్యార్థుల హాజరు శాతం పెరగాలని సూచించారు.  పాఠశాలలో  స్టాక్ రిజిస్టర్, ఇతర రెజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలను పరిశుభ్ర ముగా ఉంచాలని ప్రతి ఒక్కరు కరోన నిబంధనలు పాటించాలని తెలిపారు. అనంతరం శానిటేషన్, స్టోర్ పరిశీలించారు.
     ఈ కార్యక్రమంలో ఆర్.సి.ఓ లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ మంజుల,కె. అరుణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post