పిల్లలలో న్యూమోనియా వ్యాధి నిరోధానికి ఈ నెల 18 నుండి జిల్లాలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో “న్యూ మోకాకల్ కాంజు గేట్ వ్యాక్సిన్ ను వేయడానికి ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 12:–
పిల్లలలో న్యూమోనియా వ్యాధి నిరోధానికి ఈ నెల 18 నుండి జిల్లాలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో “న్యూ మోకాకల్ కాంజు గేట్ వ్యాక్సిన్ ను వేయడానికి ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

గురువారం అదనపు కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ మరియు అనుబంధ శాఖల తో జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల్లో న్యూమోనియా వ్యాధి నిరోధించడానికి కొత్తగా
న్యూ మోకాకల్ కాంజు గేట్ వ్యాక్సిన్ ను అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో ఈ నెల 18 న ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇట్టి విషయమై ఆయా అనుబంధ శాఖల అధికారులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఉచితంగా వేస్తున్న ఇట్టి టీకాను ఆరు వారాల వయసు గల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు.

జిల్లా వ్యాధినిరోధకటీకాలు అధికారి మాట్లాడుతూ ఆరు వారాల వయసు పిల్లలకు మిగతా టీకాలు తో పాటు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇట్టి వ్యాక్సిన్ మూడు డోసులు ఇస్తారని, మొదటి డోసు 6 వారాలకు, రెండవ డోసు 14 వారాలకు , తొమ్మిది నెలలకు మూడవ డోసు గా బూస్టర్ డోస్ వేయడం జరుగుతుందన్నారు. ఉచితంగా వేస్తున్న ఇట్టి టీకాను పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శశాంక్ దేశ్పాండే, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ, అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post