పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, భవిషత్తులో పిల్లలకు సమస్యలు రాకుండా అరికట్టడమే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కర్తవ్యమని తెలంగాణా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షులు జె. శ్రీనివాస రావు

పత్రిక ప్రకటన                                                                                                               తేదీ 30-7-2021

నారాయణపేట జిల్లా

పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, భవిషత్తులో పిల్లలకు సమస్యలు రాకుండా అరికట్టడమే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్  ప్రధాన కర్తవ్యమని తెలంగాణా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షులు జె. శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలోని స్థానిక మెట్రో గార్డన్ ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన ఒకరోజు బాల అదాలత్ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఎ. దేవయ్య, సి.హెచ్. రాగ జ్యోతి, వై. బృందాధర రావు, ఎ. శోభ రాణి తో కలిసి బాధిత బాలల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జిల్లాలో జరిగిన బాల అదాలత్ కార్యక్రమానికి చాల విశేష స్పందన వచ్చిందని,   అదాలత్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. ఈ రోజు   వచ్చిన ఫిర్యాదులను అంశాల వారిగా వేరు చేసుకొని ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని వెల్లడించారు.   విద్య, ఆర్ధిక, వనరుల పరంగా వెనుకబడిన నారాయణపేట జిల్లాలో జోగిని, బాల కార్మికులు, బాల్య వివాహాలు వంటి రుగ్మతలు ఉండటం వాల్ల ఇక్కడ  పిల్లలు  ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారి ఫిర్యాదులను పరిష్కరించాలనే ఉద్దేశం తో కమిషన్ ఈ రోజు స్వయంగా ఇక్కడకు రావడం జరిగిందన్నారు.  పిల్లల హక్కులను పరిరక్షించెందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు  కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.    చిన్న తనంలో పిల్లలు ఆదరణకు నోచుకోకుండా ఉండటం, వారి హక్కులకు భంగం కలగటం, బాల్య వివాహాలు జరగటం వల్ల కేవలం వారు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా వారి భవిషత్ తరాలు తద్వారా సమాజంలో ఇబ్బందులు ఏర్పడుతాయని పేర్కొన్నారు.  పిల్లల హాక్కులను కాపాడటానికి పిల్లల తల్లిదండ్రులతో పాటు జిల్లా యంత్రాంగం, పోలిస్ యంత్రాంగం కృషి చేస్తుందని,  అయితే అసలు సమస్యలు ఉత్పన్నం అవుతున్న చోట ప్రత్యేక ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా  బాలల హాక్కుల పరిరక్షణ  కమిటి, కార్మిక శాఖ, విద్యా శాఖ, వివిధ సంక్షేమ శాఖలు విశేషంగా కృషి చేసినందుకు వారికి, జిల్లా యంత్రంగంగానికి, పోలిస్ శాఖకు అభినందనలు తెలిపారు.

అంతకు ముందు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ మౌలిక రంగం పరంగా వెనుకబడిన నారాయణపేట జిల్లాలో పిల్లలకు దక్కాల్సిన వారి హక్కులు   నాణ్యమైన  విద్య, క్రీడలు,ఆహ్లాదం  తదితర సదుపాయాల కల్పనకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  బదియిడు పిల్లలు ప్రతి ఒక్కరు విద్యను ఆర్జించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందులో విద్యా శాఖ తో పాటు బాలల హక్కుల పరిరక్షణ కమిటి నిమగ్నమై ఉందని తెలియజేసారు.  పిల్లలకు వారి హక్కుల పై అవగాహనా కల్పించడానికి బాలల హక్కుల పరిరక్షణ కమిటితో పాటు స్వచంద సంస్థలు పనిచేస్తున్నాయని తెలియజేసారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పి డా. చేతనా మాట్లాడుతూ పిల్లల హక్కులను హరిస్తున్న వారిపై పోలిస్ శాఖ పరంగా కటినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ లాంటి కార్యక్రమాల్లో పోలిస్ శాఖ చురుకైన పాత్ర వహించి బాధ్యులపై కేసులు పెట్టడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి సెక్రటరీ వెంకట్రాం, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్,  సి.డబ్లు.సి. అధ్యక్షులు అశోక్ శ్యామల, డి.సి.పి.ఓ కుసుమలత, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు అంగన్వాడి టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు.

———————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి, నారాయణపేట ద్వారా జారి.

Share This Post