పిల్లల ఆలన పాలన కు అత్యంత ప్రాధాన్యత :-
జిల్లా కలెక్టర్ డి హరిచందన.
జిల్లాలోని పిల్లలంతా సంతోషంగా బాల్యాన్ని అనుభవిస్తూ వారు ఎదిగేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకు కేటాయించిన బాల రక్షక్ వాహనాన్ని సోమవారం రోజున కలెక్టర్ ఆవరణంలో జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ఉన్నా అందరి బాగోగులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. ఇందుకోసం సమగ్ర శిశు సంరక్షణ విభాగం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలు ఆపదలో ఉన్నా వారికి ఏ అవసరం వచ్చినా, అనాధ పిల్లల రక్షణ కు 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే చైల్డ్ సిబ్బంది తక్షణమే ఆ పిల్లలు ఉన్న ప్రాంతానికి చేరుకొని వారికి అవసరం ఉన్న సహాయాన్ని అందిస్తారని తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువులను రోడ్డుపై వదిలేసిన, చిన్న పిల్ల ల పై చట్ట వెతిరేక కార్యకలాపాలు నిర్వహించిన మరియు పిల్ల ల ద్వారా ఎట్టి చరికి చేయించిన ఎలాంటి సమాచారా నైనా కూడా 1098కి ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా చట్టానికి వ్యతిరేకంగా పిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్న వారి వివరాలు కూడా తెలపాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అశోక్, డి సి పి ఓ కుసుమలత తదితరులు పాల్గొన్నారు.