పిల్లల నిరాదరణకు గురైన వయోవృద్ధులు మౌనంగా తమ బాధలను భరించాల్సిన అవసరం లేదని అలాంటి వారికి చట్టపరంగా వారికి దక్కాల్సిన హక్కులను ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

శుక్రవారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాబు జగ్జీవన్ రామ్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయవృద్ధులు తమ పిల్లల ఆదరణకు నోచుకోని పరిస్థితులు లేదా తమ పెరిట ఉన్న ఆస్తిని ఇప్పటికే తమ పిల్లల పేరున రాసి ఇచ్చేసి నిరాదరణకు గురి అవుతులున్నట్లయితే అలాంటి వయోవృద్ధులు మౌనంగా బాధలు అనుభవించాల్సిన అవసరం లేదని తెలియజేసారు. 2007 లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వయోవృద్ధుల చట్టాన్ని 2011 నుండి నిబంధనలు అమల్లోకి వచ్చాయని, ఈ చట్టం ప్రకారం తమ పిల్లల నుండి నెల నెలా కొంత భృతిని పిల్లల నుండి పొందవచ్చన్నారు. అదే విధంగా ఆస్తి రాసేసి ఉండి నిరాదరణకు గురి అయితే ఒక దరఖాస్తు ఇస్తే రాసిచ్చిన ఆస్తిని రద్దు చేసి తిరిగి పొందేందుకు ఆర్డీఓ కు లేదా జిల్లా కలెక్టర్ కు అధికారాలు కేటాయించడం జరిగిందన్నారు. అందుకే ఈ రోజు ఈ వయోవృద్ధుల దినోత్సవం ఏర్పాటు చేసి అందరికి చట్టం పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా చట్టంలో ఉన్న నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చట్టం కాపీని ఓక కరదీపిక రూపంలో తయారు చేసి అందరికి పంచడం జరిగిందన్నారు. ఇక నుండి మీకు గాని మీ చుట్టుపక్కల ఉన్న వయోవృద్ధుల కు అన్యాయం జరుగుచున్నట్లు గ్రహిస్తే గ్రామంలో ఉన్న అంగన్వాడీ టీచరును సంప్రదించిన వారు దరఖాస్తు రాసిచ్చి సలహాలు సూచనలు చేస్తారని తెలియజేసారు. అనంతరం వయోవృద్ధులకు కలెక్టర్ శాలువాలు, ప్రశంసా పత్రంతో సత్కరించారు. వయోవృద్ధుల చట్టం పై రూపొందించిన కరదీపికలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వయోవృద్ధుల అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ వయోవృద్ధులపై అసమానతలను ప్రదర్శిస్తున్నారని, పిల్లలు తమ స్వార్థం కోసం తమ తల్లిదండ్రులను అనాధాశ్రలయాలకు పంపించడం, కనీస జీవనభృతి కల్పించలేకపోతున్నారన్నారు. అలాంటి వారికి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ ను కోరారు.
కమిటీ కార్యదర్శి సర్దార్ అలీ మాట్లాడుతూ ప్రస్తుతం కంప్యూటర్ యుగం నడుస్తున్నందున పిల్లలు తమ తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్లిపోవడం వల్ల తల్లిదండ్రులకు కనీస పలకరింపులు, ఆర్థిక సహాయం లేక మరికొందరు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై వయోవృద్ధులకు ధైర్యాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి టి.యూ. వెంకటలక్ష్మి, డిఆర్డీఓ నర్సింగరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సుధాకర్ లాల్, డిపిఆర్వో సీతారాం, డి.సి.పి.ఓ ఇంతియాజ్, సఖి కో ఆర్డినెటర్, వయోవృద్ధుల కమిటీ సభ్యులు ఆకారపు విశ్వనాథ్, స్థానిక కౌన్సిలర్ ఇసాక్. వయోవృద్ధులు పాల్గొన్నారు.

Share This Post