పిల్లల పెరుగుదలకు పోషక ఆహారాలను అందించాలి- అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్


రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 09: పిల్లల పెరుగుదలకు పోషక ఆహారాలను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోషణ మాసం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు సందర్భంగా కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో రక్తహీనత, పౌష్ఠిక ఆహారం లోపం , తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పోషణ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడం అన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పసి పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్ఠిక ఆహారం అందించాలని సూచించారు. మండలాల వారీగా పిల్లలలో ప్రస్తుతం ఉన్న బరువు, ఉండాల్సిన బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలని, పిల్లల్లో అనిమియా రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా శానిటేషన్ చేయించాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు.
పిల్లల ఎత్తు, బరువు ఎప్పటికప్పుడు కోలిచి అప్డేట్ చేయాలని అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నీటి సౌకర్యం కల్పించాలని, పెండింగులో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
అనంతరం పోషణ మాసం గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మోతి, జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మీ, విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, డీ పీ.ఓ శ్రీనివాస్ రెడ్డి, సీపీఓ ఓం ప్రకాష్ , మిషన్ భగీరథ అధికారులు, సీ.డీ.పీ.ఓ లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post