పిల్లల పెరుగుదల పరిరక్షణ పై ICDS అధికారుల సమావేశం లో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్.

పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం అందించాలి.

అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
o0o

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో నమోదై ఉన్న 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి పౌష్టికాహారం అందించాలని లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిల్లల పెరుగుదల పర్యవేక్షణ పై ఐ.సి.డి.ఎస్. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. తక్కువ బరువు ఉన్న పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మంగళవారం అన్ని ప్రాజెక్టులలోని అన్ని సెంటర్లలో గ్రోత్ మానిటరింగ్ డే నిర్వహించాలని ఆదేశించారు. మహిళ సంఘాల సహకారంతో ఎదుగుదల లేని పిల్లలకు ఐరన్ సంబంధిత ఆహార పదార్ధాలను అందించాలని ఆదేశించారు. ప్రతి నెల నిర్వహించే మహిళ సంఘాల గ్రామ సభలలో పోషణ లోపంతో భాదపడుతున్న పిల్లల గురించిన ఏజెండా అంశంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పిల్లలకు పోషక విలువలు ఉన్న పౌష్టికాహారం అందిస్తే శారరీకంగా, మానసికంగా ఎదుగుతారని అన్నారు. పిల్లలు వయస్సు కంటే తక్కువ బరువు ఉన్నట్లయితే న్యూట్రిషన్, రిహబిలిటేషన్ సెంటర్ కు తీసుకువెళ్లి చూపించాలని అన్నారు. పిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు పౌష్టికాహారం అందించుటకు తోడ్పాడు అందించాలని అన్నారు. గ్రామాల్లో పౌష్టికాహారం పై సదస్సులు ఏర్పాటు చేసి తల్లులకు అవగాహన కల్పించాలని అన్నారు. సదస్సుల నిర్వాహణకు కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజర్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లకు విజ్ఞాన పర్యటనలు ఏర్పాటు చేసి తగిన శిక్షణలు ఇవ్వాలని అన్నారు.

ఈ సమావేశంలో సి.డి.పి.వో.లు, పోషణ అభియాన్ సిబ్బంది, అంగన్వాడీ సూపరైజర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post