పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

పిల్లల ఎదుగుదలకు తల్లులు తోడ్పాటును అందించాలి

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

ఎలగందుల లో పోషణ అభియాన్ మాసో త్సవం- పిల్లల పెరుగుదల పర్యవేక్షణ దినోత్సవము

00000

పిల్లల ఎదుగుదలకు తల్లులు తోడ్పాటును అందించాలని, పిల్లల వయస్సు ప్రకారం ఎదుగుదల ఉండేలా చూసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. పోషణ అభియాన్ మాసోత్సవం లో భాగంగా మంగళవారం ఐ సి డి ఎస్ కరీంనగర్ అర్బన్ సెంటర్ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పిల్లల పెరుగుదల పర్యవేక్షణ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎనీమియా విముక్తి భారత్ గా చేయడమే లక్ష్యంగా చేపట్టిన పోషణ అభియాన్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. రక్తహీనత లేకుండా చూడడం, పిల్లల్లో ఎదుగుదల పెంచేందుకు పెరుగుదల పర్యవేక్షణ కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు, పిల్లల తల్లులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు ఐరన్ టాబ్లెట్లు తీసుకోవాలని, పాలు, గుడ్లు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలి అని అన్నారు. ఏడు నెలలు దాటిన పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో అందించే బాలామృతం నివ్వాలని సూచించారు. పిల్లలు వయస్సు కంటే తక్కువ బరువు ఉన్నట్లయితే న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ కు తీసుకెళ్ళి చూపించాలని తెలిపారు. అనంతరము పిల్లలు, మహిళల్లో పోషణ లోపం లేకుండా చూస్తామని పిల్లల తల్లుల చేత అదనపు కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరము ఐసిడిఎస్ సిబ్బంది, అంగన్వాడి సెంటర్ సిబ్బంది మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి రవీందర్, ఎలగందుల సర్పంచ్ ఎల్దండి షర్మిల, ఉప సర్పంచ్ బోనాల నరేష్, ఎంపీటీసీ మంద రమేష్, కరీంనగర్ అర్బన్ సెంటర్ సి డి పి ఓ ఉమారాణి, సూపర్వైజర్ లలిత, పోషణ అభియాన్ జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ రో మి లా, కొత్తపల్లి మండల ఎంపీడీవో, అంగన్వాడి సెంటర్ టీచర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post