పిల్లల మానసిక శారీరక అభివృద్ధి ని పరిశీలించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పిల్లల మానసిక శారీరక అభివృద్ధి ని పరిశీలించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జిల్లాలో అన్ని అంగన్వాడీ లలో నమోదైన పద్నాలుగు వేల మంది పిల్లల శారీరక మానసిక అభివృద్ధి ని అందరు సూపర్వైజర్ లు పరిశీలించి పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఐ సి డి ఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సఖి సెంటర్ మీటింగ్ హాల్ లో అంగన్వాడీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అంగన్వాడీ లలో అమలు జరిగే తీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందరు పిల్లలు కనీసం తల్లి పేరు, తండ్రిపెరు , ఇంటి అడ్రస్ చెప్పగలగాలి.లోపలి ఆటలు, బయటి ఆటలు ఆడాలి. ఇంగ్లిష్ అక్షరాలు తెలుగు అక్షరాలు అంకెలు గుర్తు పట్టాలన్నారు.పూర్వ ప్రాథమిక విద్య అన్ని అంగన్వాడీ లలో సక్రమంగా అమలయ్యేందుకు సూపర్వైజర్ లు, ప్రథం ఎన్ జి ఓ లు సంయుక్తంగా పనిచేయాలని చెప్పారు. అంగన్వాడీ పరిధిలోని అందరు పిల్లల బరువులు తప్పులు లేకుండా గ్రోత్ రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. లోపపోషన పిల్లలు లేని జిల్లాగా నారాయణపేట ను మార్చటానికి అందరూ పనిచేయాలని, పిల్లలకు సరఫరా చేసే బాలామృతం ప్యాకెట్లు సక్రమంగా అందెట్లు చూడాలని, అరోగ్యలక్ష్మి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు జరిగేల చూడాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ స్మైల్ అమలు పై సమీక్షించిన కలెక్టర్ బాలకార్మికుల ను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకొనందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ సి పి ఎస్ అధికారులు సరైన అవగాహన కలిగి లేనందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. సఖి సెంటర్ పనితీరును సమీక్షించారు. జనవరి నెలలో కేవలం పదిహేను కేసులు నమోదు కావటం పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సఖి సిబ్బంది పనితీరు మార్చు కోవాలని తెలిపారు.వచ్చేనెలలో కనీసం 50 మందికి సఖి సేవలు అందాలని ఆయన నిర్దేశించారు

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, సి డి పి ఓ లు, ఐ సిపియేస్ సిబ్బంది, సఖి సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post