పి అండ్ జి అంతర్జాతీయ కాస్మోటిక్స్ ఉత్త్పతుల యూనిట్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామరావు ప్రారంభించారు.

సోమవారం షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూర్ మండలంలోని పెంజర్ల గ్రామంలో పి అండ్ జి అంతర్జాతీయ కాస్మోటిక్స్ ఉత్త్పతుల యూనిట్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామరావు, రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, శాసన సభ్యులు అంజయ్య యాదవ్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పి అండ్ జి ఆధ్వర్యంలో 200 కోట్ల పైగా పెట్టుబడులతో నెలకొల్పిన యూనిట్ ను ప్రారంభించుకోవడం చాల సంతోషంగా ఉంది. రానున్న రోజులలో డిటర్ జెంట్ లిక్విడ్ అధికంగా వినియోగమలోకి వస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పి అండ్ జి సంస్థ పరిశ్రమలు
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమీషనర్ కృష్ణ భాస్కర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post