పి.ఎం . కేర్స్ కింద ఆర్థిక సహాయం అందజేత:: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ప్రచురణార్థం—-1

ప్రచురణార్థం----1 పి.ఎం . కేర్స్ కింద ఆర్థిక సహాయం అందజేత:: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగిత్యాల జిల్లాలో 22 మంది అనాధలకు పీఎం కేర్స్ పథకం వర్తింపు జగిత్యాల, మే 30:-  కరోనా వల్ల దేశంలో అనాథ లైన 4345 పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద సహాయం అందజేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం దేశంలోనే అన్ని జిల్లా కలెక్టర్ల తో పీఎం కేర్స్  ఫర్ చిల్డ్రన్ పథకం అమలులో భాగంగా లబ్ధిదారులకు హెల్త్ కార్డులు, ఆర్థిక సహాయ సర్టిఫికేట్లు పాసుబుక్కులు పంపిణీ చేశారు.  కరోనా వంటి మహమ్మారి కారణంగా దేశంలో లో తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తు కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని రూపొందించామని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచంలో లో అభయ వృద్ధి చెందిన అనేక దేశాలు సైతం కరోనా కారణంగా చాలా నష్టపోయారని, మనదేశంలో నష్టాలను నియంత్రించడంలో పని చేసిన అధికారులకు సిబ్బందికి సహకరించిన ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.  తల్లిదండ్రులు కోల్పోయిన బాధను తీర్చే అవకాశం లేనప్పటికీ పిల్లల భవిష్యత్తు భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దేశమంతా పిల్లలకు తోడుగా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు.  దేశ ప్రజలు తమ కష్టార్జితం మంచి విరాళంగా ఇచ్చిన సొమ్ముతో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అమలు చేస్తున్నామని, పిల్లలు తమ కలలను సాకారం చేసుకునే దిశగా సంకల్పంతో కృషి చేయాలని ఆయన కోరారు.  దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో లో అధిక అమృత మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, వీరోచిత పోరాట తత్వంతో కూడిన స్వాతంత్ర సమరయోధుల స్పూర్తి మనందరికీ ఆదర్శనీయమని ప్రధాన మంత్రి అన్నారు.  స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కరోనా పై సైతం పోరాడే కొంతమేర విజయం సాధించామని, 200 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కేంద్ర మహిళా పిల్లల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద పిల్లలకు 23 సంవత్సరాలు నిండిన వెంటనే రూ.10 లక్షలు అందేలా బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు కు 10 లక్షల పై వచ్చే వడ్డీ ప్రతి నెల అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.  పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం పిల్లలకు రూ.20 వేల స్కాలర్షిప్, 18 సంవత్సరాలవరకు పిల్లల భోజనం వసతి ఖర్చులకు మహిళా మంత్రిత్వ శాఖ ప్రతి నెల రూ.4 వేల ఆర్థిక సహాయం అందిస్తామని, ఉన్నత చదువులు చదివేందుకు తీసుకునే విద్యా రుణాలపై వడ్డీ భారాన్ని పీఎం కేర్స్ మంచి భరిస్తామని తెలిపారు. 23 సంవత్సరాల వరకు పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్స నిమిత్తం రూ.5 లక్షల ఆరోగ్య బీమా ప్రీమియం పీఎం కేర్స్ మంచి చెల్లించడం జరుగుతుంది అని ఆమె అన్నారు. ప్రతి పిల్లవాడికి రూ.50 వేలు ఎగ్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు దేవయ్య మాట్లాడుతూ అనాధలైన పిల్లల భవిష్యత్తు భద్రత కల్పించేందుకు మంచి పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వమే అనాధ పిల్లల పెద్దదిక్కుగా మారి మంచి భవిష్యత్తు అందించే దిశగా పనిచేస్తుందని తెలిపారు. పిల్లల ఎదుగుదలపై నిరంతర పరిశీలన చేసేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారని అన్నారు.  సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 22 మంది కరోనా కారణంగా అనాధలైన పిల్లలను గుర్తించి పీఎం కేర్స్ పథకం అమలు చేశామని అన్నారు.  జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, ఎస్సి వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, బిసి వెల్ఫేర్ అధికారి సాయిబాబా సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది
పి.ఎం . కేర్స్ కింద ఆర్థిక సహాయం అందజేత:: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

జగిత్యాల జిల్లాలో 22 మంది అనాధలకు పీఎం కేర్స్ పథకం వర్తింపు

జగిత్యాల, మే 30:- కరోనా వల్ల దేశంలో అనాథ లైన 4345 పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద సహాయం అందజేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం దేశంలోనే అన్ని జిల్లా కలెక్టర్ల తో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం అమలులో భాగంగా లబ్ధిదారులకు హెల్త్ కార్డులు, ఆర్థిక సహాయ సర్టిఫికేట్లు పాసుబుక్కులు పంపిణీ చేశారు.

కరోనా వంటి మహమ్మారి కారణంగా దేశంలో లో తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తు కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని రూపొందించామని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచంలో లో అభయ వృద్ధి చెందిన అనేక దేశాలు సైతం కరోనా కారణంగా చాలా నష్టపోయారని, మనదేశంలో నష్టాలను నియంత్రించడంలో పని చేసిన అధికారులకు సిబ్బందికి సహకరించిన ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

తల్లిదండ్రులు కోల్పోయిన బాధను తీర్చే అవకాశం లేనప్పటికీ పిల్లల భవిష్యత్తు భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దేశమంతా పిల్లలకు తోడుగా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు.

దేశ ప్రజలు తమ కష్టార్జితం మంచి విరాళంగా ఇచ్చిన సొమ్ముతో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అమలు చేస్తున్నామని, పిల్లలు తమ కలలను సాకారం చేసుకునే దిశగా సంకల్పంతో కృషి చేయాలని ఆయన కోరారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో లో అధిక అమృత మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, వీరోచిత పోరాట తత్వంతో కూడిన స్వాతంత్ర సమరయోధుల స్పూర్తి మనందరికీ ఆదర్శనీయమని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కరోనా పై సైతం పోరాడే కొంతమేర విజయం సాధించామని, 200 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ఆయన తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కేంద్ర మహిళా పిల్లల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద పిల్లలకు 23 సంవత్సరాలు నిండిన వెంటనే రూ.10 లక్షలు అందేలా బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు కు 10 లక్షల పై వచ్చే వడ్డీ ప్రతి నెల అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం పిల్లలకు రూ.20 వేల స్కాలర్షిప్, 18 సంవత్సరాలవరకు పిల్లల భోజనం వసతి ఖర్చులకు మహిళా మంత్రిత్వ శాఖ ప్రతి నెల రూ.4 వేల ఆర్థిక సహాయం అందిస్తామని, ఉన్నత చదువులు చదివేందుకు తీసుకునే విద్యా రుణాలపై వడ్డీ భారాన్ని పీఎం కేర్స్ మంచి భరిస్తామని తెలిపారు. 23 సంవత్సరాల వరకు పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్స నిమిత్తం రూ.5 లక్షల ఆరోగ్య బీమా ప్రీమియం పీఎం కేర్స్ మంచి చెల్లించడం జరుగుతుంది అని ఆమె అన్నారు. ప్రతి పిల్లవాడికి రూ.50 వేలు ఎగ్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు దేవయ్య మాట్లాడుతూ అనాధలైన పిల్లల భవిష్యత్తు భద్రత కల్పించేందుకు మంచి పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వమే అనాధ పిల్లల పెద్దదిక్కుగా మారి మంచి భవిష్యత్తు అందించే దిశగా పనిచేస్తుందని తెలిపారు. పిల్లల ఎదుగుదలపై నిరంతర పరిశీలన చేసేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారని అన్నారు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 22 మంది కరోనా కారణంగా అనాధలైన పిల్లలను గుర్తించి పీఎం కేర్స్ పథకం అమలు చేశామని అన్నారు.

జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, ఎస్సి వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, బిసి వెల్ఫేర్ అధికారి సాయిబాబా సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post