పి.యం. స్వనిధి కింద ఆర్హులైన వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

పత్రికా ప్రకటన నల్గొండ,జనవరి 11. పి.యం.స్వనిధి కింద ఆర్హులైన వీధి వ్యాపారులను గుర్తించి లక్ష్యం మేరకు రుణం మంజూరు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ బ్యాంకర్ల ను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మెప్మా, బ్యాంకు అధికారులతో పి.యం.స్వనిధి ద్వారా వీధి వ్యాపారులకు రుణ మంజూరు పై సమీక్షించారు.ఇప్పటికే పది వేల రూ.ల రుణం మంజూరు చేసిన లబ్ధిదారులు తీసుకున్న రుణం తిరిగి చెల్లించిన వారికి ఇరవై వేల రూ.లు,కొత్త వారికి పది వేల రూ.లు రుణం మెప్మా సిబ్బంది బ్యాంకు ల ద్వారా మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం,తదితరులు పాల్గొన్నారు.

Share This Post