పి.హెచ్.సి సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ


ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి డిసెంబర్ 3:- అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ముత్తారం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఓడేడు గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 18485 మంది ప్రజలకు వాక్సినేషన్ అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 15081(78%) మంది ప్రజలకు మొదటి డోసు, 5992(36%) మంది పిల్లలకు రెండో డోస్ అందించామని అధికారులు వివరించారు. ఓమిక్రాన్ వేరియంట్ నూతనంగా వ్యాప్తి అవుతుందని, 100% వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే దీన్ని నియంత్రించగలమని కలెక్టర్ పేర్కొన్నారు ప్రజలు స్వచ్ఛందంగా సమీపంలోగల వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ తీసుకొని వారిని గుర్తించి, నూతన వేరియంట్ వ్యాప్తి పై అవగాహన కల్పించి వారికి వ్యాక్సినేషన్ అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు లోటు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషెంట్ల సంఖ్య వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రిలో సకాలంలో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఓపి ల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు గత 4 నెలలుగా ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగకపోవడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సాధారణ ప్రసవాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఓడెడు గ్రామంలోనే వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వ్యవసాయ ఆధారిత పనులు అధికంగా గ్రామంలో జరుగుతున్నందున వైద్య సిబ్బంది తెల్లవారుజామున మరియు సాయంత్రం గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించిన కలెక్టర్ మొక్కల పెంపక లక్ష్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎం.పి.డి.ఓ.శ్రీనివాస్,ఎం. పి.ఓ,వేణుమాధవ్,మెడికల్ అధికారి డా. వంశీకృష్ణ,సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి చేజారి చేయబడినది.

Share This Post