పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలి తల్లి పాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలి

తల్లి పాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

     తల్లిపాలు అమృతంతో సమానమని, పుట్టిన గంట లోపు శిశువుకు ముర్రు పాలు పట్టించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ సూచించారు.

     ప్రపంచ తల్లి పాల వారోత్సవాలలో భాగంగా మంగళవారం కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో విశేషాలు ఉన్న తల్లిపాల గొప్పదనం తెలియక పిల్లలకు సరిగ్గా తల్లిపాలు ఇవ్వడం లేదని అన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత వివరిస్తూ పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని సూచించారు. తల్లిపాలు శిశువు రోగనిరోధకశక్తి పెరుగుదలకు ఎంతగానో దోహద పడుతుందన్నారు. తల్లిపాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయన్నారు. తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారన్నారు. తల్లిపాలు తాగిన పిల్లలకు ఐక్యూ ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల కోసం అన్ని సౌకర్యాలు ఉంటాయని ఇక్కడ సాధన ప్రసవాలకు ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. సాధారణ ప్రసవాలు వల్ల తల్లికి భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయని అన్నారు. ఆపరేషన్ల ద్వారా బిడ్డను కనడం వల్ల తల్లి బిడ్డలకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని అన్నారు.

     అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ, బాలింత అంగన్వాడీలో తమ పేరు నమోదు చేసుకొని అంగన్వాడీ సేవలను స్వీకరించాలని అన్నారు. బిడ్డ బరువును అంగన్వాడి టీచర్ ఎప్పటికప్పుడు పరిశీలించి తద్వారా పోషకాహారం ఎంత మోతాదులో ఇవ్వాలని అవగాహన కల్పిస్తారని అన్నారు. గర్భిణీ, బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రం లో ఇచ్చే భోజనం చేయాలన్నారు. పుట్టిన గంటలోపే పిల్లలకు ముర్రుపాలు పట్టించాలని తద్వారా శిశువు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వి పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, సిడిపిఓలు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post