పుట్టిన బిడ్డకు ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు అన్ని పౌష్టికాహార పదార్థాలు తినిపించి ఆరోగ్యంగా కాపాదుకుంటేనే వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

పుట్టిన బిడ్డకు ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు అన్ని పౌష్టికాహార పదార్థాలు తినిపించి ఆరోగ్యంగా కాపాదుకుంటేనే వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.  సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎత్తుకు తగ్గ బరువు వయసుకు తగ్గ ఎత్తు, వయసుకు తగ్గా ఎత్తు లేని స్యాం మ్యాం పిల్లల పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ఆరు సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే నాటికి అన్ని రకాల పౌష్టిక ఆహారం అందించి వారిని ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు తోపాటు అంగన్వాడి ఆశ కార్యకర్తపై ఉందని తెలియజేశారు. ఒకవేళ ఈ వయస్సులో  పోషకాహార లోపంతో బాధపడితే పెద్దగా అయ్యాక ఎలాంటి పౌష్టికాహారం తీసుకున్న తన ఆరోగ్యం ఎదో ఒక రోగముతో జీవితాంతం సతమతమవుతూ గడపాల్సి వస్తుందని హెచ్చరించారు.  అందుకే జిల్లాలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సమనవ్యయం తో పని చేసి ముందుగా ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలను, అదేవిధంగా రక్త హీనత తో బాధపడుతున్న గర్భిణీలను గుర్తించాలని ఆదేశించారు.  తప్పుడు బరువులు, తప్పుడు లెక్కలు చూపించాల్సిన అవసరం లేదని పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు  మంచి పోషకవిలువలు కలిగిన పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతులుగా మార్చడమే మన కర్తవ్యమని తప్పుడు లెక్కలు, తప్పుడు కొలతలు చూపించి వారికి అన్యాయం చేయవద్దని హెచ్చరించారు.  ముందుగా వచ్చే మూడు రోజుల్లో స్యాం, మ్యాం పిల్లలు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలను గుర్తించాలని వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ అంగన్వాడీ పరిధిలో ఉన్నారు అనే వివరాలు సేకరించాలన్నారు.  గురయించిన పిల్లలు, గర్భిణీలకు ఆకలి పరీక్షలు,  వైద్య పరీక్షలు నిర్వహించి కారణాలను తెలుసుకోవాలన్నారు.  వచ్చే శుక్రవారం జిల్లాలో న్యూట్రీ చిక్కి లు, లడ్డులు తయారు చేయించి పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణీలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 301 మంది స్యాం పిల్లలు, 1003 మంది మ్యాం పిల్లలను గుర్తించడం జరిగిందని రక్తహీనతతో బాధ పడుతున్న ప్రతి గర్భిణీ ని సైతం గుర్తించాలని ఆదేశించారు.  పిల్లలకు బాలామృతం తో పాటు న్యూట్రీ చిక్కిలు, లడ్డులను పిల్లలకు అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్ కలిసి  స్వయంగా తినిపించాల్సి ఉంటుందని అలాంటి ఫోటోలు, వీడియోలు ప్రతిరోజు వాఁట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టాల్సి ఉంటుందన్నారు.  సి.డి.పి.ఓ లు, సూపర్వైజర్లు తమ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఈ విషయం పై కర్తవ్య బోధన చేయాల్సి ఉంటుందని అదేవిధంగా తమ ఆశ కార్యకర్తలకు వైద్య శాఖ ద్వారా తగు ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు. మూడు నెలల పాటు  రోజుకు 20 గ్రాముల  న్యూట్రీ చిక్కిలు, బాలామృతం తో పాటు అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు.  ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్యాం, మ్యాం పిల్లలు, రక్తహీనత తో బాధపడే వారి సంఖ్య సున్నా కు పడిపోవాలని లేనిపక్షంలో సంబంధిత అంగన్వాడీ, ఆశా కార్యకర్తలే బాధ్యత వహించాలని  తెలియజేసారు.  వీటితో పాటుగా స్థానికంగా దొరికే ఐరన్ ఎక్కువ శాతం ఉన్న పుంటి కూర, రాగితో చేసిన తినుబండారాలు, కొర్రలు, సజ్జలు,  ఆకు కూరలు ఎక్కువగా తినే విధంగా గర్భిణీలకు, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.  వచ్చే నెలలో అన్ని మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులతో పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.  నారాయణపేట జిల్లాను పౌష్టికాహార లోపం లేని ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో కలిసి ఇదేపనిని శ్రద్దగా చేస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలియజేసారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆదనవు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా వైద్య అధికారి డా.  రామ్ మనోహర్, ఉప వైద్యాధికారి, డా. శైలజ,  సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post