పునరావాస కేంద్రం నిర్మాణాలపై ప్రత్యేక సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
1.12 .2021 .
వనపర్తి

పునరావాస బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.

బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శంకర సముద్రం రిజర్వాయర్ క్రింద ముంపుకు గురయ్యే కనాయపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యలపై పునరావాస కేంద్రం నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం  రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు నిర్వహించిన సమావేశంలో కానాయ పల్లి గ్రామంలో 1129 మందికుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 ఏళ్ళు పై పడినవారు 339 మంది ఉన్నారని వారికి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.29 మందికి మిస్సింగ్ పిడిఎఫ్ లో ఉన్నందున  తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు మార్చి 2022 నాటికి పునరావాస నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డైరెక్టర్, ఆర్ అండ్ ఆర్,  రుఫస్ దతమి,ఎస్ ఈ సత్యశీల రెడ్డి, సర్పంచ్ సురేందర్, జడ్పీటీసీ విష్ వేష్ వార్, మెగా రెడ్డి,  నిర్వాసితులు పాల్గొన్నారు..
………………………………..
 జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడింది.

Share This Post