పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది :29- 9- 2021

పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని   జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిధి లో ఉన్న ఆర్ అండ్ ఆర్ సెంటర్ ల పై ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని , అధికారులు తగు  చర్యలు తీసుకోవాలని అన్నారు.  జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్న నాగర్ దొడ్డి ముంపు గ్రామం అయినందున  రైతులు చాలా ఇబ్బందులు పడ్తున్నారని అందరికి న్యాయం జరిగేలా చేయాలనీ అన్నారు.  నాగర్ దొడ్డి లో మ్యాప్ ప్రకారం 26 ఎకరాలు , 287 మంది కుటుంబాలు, ర్యాలంపాడు లో 67 ఎకరాలలో  816 కుటుంబాలు  ఉన్నాయని,  వారికి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు  చర్యలు చేపట్టాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనీ  కలెక్టర్ ఆదేశించారు. సర్వే చేసి ఎంత ల్యాండ్ ఉందొ 1 1/2 నెలలో రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. ఫైల్ రెడీ చేసి వెంటనే గుర్తించిన కుటుంబాలకు పట్టాలు అందెలా చూడాలని అన్నారు. ర్యాలంపాడు కమిటీ సభ్యులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రోడ్డు అబ్జెక్షన్ ఇష్యూ లను వెంటనే పరిష్కరించేలా చూడాలని అన్నారు. ఆలూరు లో 350 మంది రైతులు ఇండ్లు, ఫ్లాట్ లు లేని వారు ఉన్నారని వారందరికీ పట్టాలు ఇప్పించాలని అన్నారు. పునరావాస కేంద్రాలలో తాగునీరు, పాఠశాలలు,  విద్యుత్ ,రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనీ, గ్రామ పంచాయతి బిల్డింగ్ , కమ్యూనిటీ హాలుల నిర్మాణాలు  పూర్తి చేయాలనీ అన్నారు. టెంపుల్స్ కోసం టెండర్లు పూర్తి చేసి రెవిన్యూ మరియు పోలీస్ సపోర్ట్ తో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని అన్నారు.

స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ సభలను పెట్టాలని అన్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రైతులతో మాట్లాడి 6 నెల్లలో పనులు పూర్తి చేయాలనీ అన్నారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్ లకు సంబంధించిన ఎస్టిమేషన్ పెండింగ్ ఉంటే ఇంకోసారి దృష్టికి తీసుకురావాలని అన్నారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్ డి ఓ రాములు , ఇరిగేషన్ సి.ఇ రఘునాథ్ రావు, శ్రీనివాస్ రావు, ఇ ఇ లు , జుబెర్, రహీముద్దీన్, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు…..

——————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

Share This Post