పునరుద్ధరణీయ ఇంధన వనరులను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.

          మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో 14. -12. -2021  నుండి 20. -12. -2021 వరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TSREDCO) నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాల పై గోడ పత్రికను విడుదల చేసారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించారు.సోలార్ నెట్ మీటర్ ఇంటి పై నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇస్తుందని అన్నారు.

          ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలని అన్నారు.

          ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మేనేజర్ టి.వేణు గోపాల్ (TSREDCO), సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post