పురస్కరించుకొని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సందర్శించారు

రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో రైతుకు ధీమా కల్పించిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆదివారం నాడు స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ కామారెడ్డి జిల్లా ప్రగతి గురించి ప్రసంగిస్తూ…. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా నేను వినమ్ర నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. మహాత్మా గాంధీ చూపిన బాటలో అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒక్క నెత్తురు బొట్టు కూడా కింద పడకుండా అహింసా మార్గంలో, మహాత్మా గాంధీ చూపిన బాటలో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజానీకంలో ఆనందం చిందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, అలాంటి బంగారు తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు, రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే ముందంజలో ఉందని అన్నారు. మన రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కల్పించిన రైతు బంధు పథకం ఐక్యరాజ్యసమితి రోమ్ నగర సమావేశంలో గుర్తించిందని, రైతుబంధుపై మనం ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుఖంగా ఉంటుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు కావలసిన అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నదని అన్నారు.
ఈ సంవత్సరం జూన్ జూలై నెలలలో సాధారణం కన్నా 90 శాతం అధికంగా వర్షం కురవడం వలన నిజాంసాగర్, పోచారం, కౌలాస్ నాల ప్రాజెక్ట్ లతో పాటు చెరువులలోకి నీరు వచ్చి భూగర్భ నీటి లభ్యత కూడా పెరిగిందని, జిల్లాలో వివిధ రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 4 లక్షల 23 వేల 722 ఎకారాలు కాగా 4 లక్షల 68 వేల 892 ఎకరాలాలో సాగుచేయడం జరిగిందని, ఇది సాధరణ విస్తీర్ణం కన్నా 10 శాతం అధికమని అన్నారు. తేది 16-08-2021 నుండి 50 వేల లోపు గల పంట ఋణాలను మాఫీ చేయడం జరుగుచున్నదని, తద్వారా జిల్లాలోని 30,307 మంది రైతులకు సంబంధించిన 89 కోట్ల 79 లక్షల రూపాయలను మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం వానాకాలం 2021 గాను 2 లక్షల 62 వేల 841 మంది రైతులకు బ్యాంకు ఖాతాలలో 255 కోట్ల 8 లక్షలు జమ చేయడం జరిగినదాని, తద్వారా రైతన్నలలో విశ్వాసాన్ని ఆత్మ స్థైర్యాన్ని పెంచిందన్నారు.
రైతు కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా దురదృష్టవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల రుపాయల బీమాను ప్రభుత్వం కల్పిస్తున్నదని, 18 సంవత్సరముల నుండి 59 సంవత్సరముల వయస్సు ఉన్న ప్రతి రైతుకి వర్తిస్తుందని, జిల్లాలో 1 లక్ష 68 వేల 700 మంది రైతు బీమా పథకానికి అర్హత కలిగి ఉన్నారని, ఈ పథకము ప్రారంభం అయిన నుండి ఇప్పటి వరకు 3,163 మంది రైతుల నామిని బ్యాంకు ఖాతాలో 158 కోట్ల 15 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత వాన కాలంలో 69,982 మంది రైతులకు 625 కోట్ల రూపాయలను ఋణాలుగా అందించడం జరిగిందన్నారు.
రైతు వేదికల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు పంటల పైన అవగాహన, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసే విధానాల పైన శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటి వరకు జిల్లాలో 3,304 శిక్షణ తరగతుల ద్వారా 95 వేల మంది రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
యాసంగిలో పండిన 4 లక్షల 51 వేల 746 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 342 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసి 851 కోట్ల 41 లక్షల రూపాయలను 95 వేల 51 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.
SC, ST లకు 100 శాతం, చిన్న సన్నకారు రైతులకు 90 శాతం రాయితీతో 120 హెక్టార్లలో బిందు తుంపర సేద్య పరికరాలను అందించుటకు రైతులను గుర్తించడం జరిగిందన్నారు. ఆయిల్ ఫాం సాగుకు మన జిల్లా అనుకూలంగా ఉండటంచేత 1,438 హెక్టర్లలో సాగు చేయుటకు గుర్తించడం జరిగిందన్నారు. ఆయిల్ ఫాం సాగును పెద్ద ఎత్తున చేపట్టాలని రైతులను కోరుకుంటున్నానన్నారు.
2020-21 సంవత్సరమునకు జిల్లాలో మొత్తం 592 చెరువులలో 3 కోట్ల 29 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం జరిగిందన్నారు. దీనికి గాను 2 కోట్ల 58 లక్షలు ఖర్చు చేసి, నిజాంసాగర్, కౌలస్ నాల, అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు మరియు కామారెడ్డి పెద్ద చెరువులలో 24 లక్షల 95 వేల రొయ్య పిల్లలు విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈ సంవత్సరము 599 చెరువులలో 3 కోట్ల 36 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
జిల్లాలో 314 గొర్రెల ప్రాథమిక సహకార సంఘాల సభ్యులకు 75 శాతం ప్రభుత్వ రాయితీతో మొదటి విడుటలో 8,640, రెండవ విడుతలో 8,534 లబ్దిదారులు ఎంపిక చేసి ఇప్పటి వరకు 123 కోట్ల 62 లక్షల ఖర్చుతో 9,890 గొర్రెల యూనిట్లను అందచేయడం జరిగిందన్నారు.
264 డైరీ సోసైటీల ద్వారా 11,786 మంది లబ్దిదారులను నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 22 కోట్ల 64 లక్షలతో 2,831 పాడి పశువులను లబ్దిదారులకు పంపిణి చేయడం జరిగింది.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య కాలువలు, ఉప కాలువల ఆధునీకరణ కొరకు 276 కోట్ల రూపాయలు మంజూరు కాగ, ఇప్పటి వరకు 250 కోట్ల విలువ గల పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రధాన కాలువ ప్యాకేజి, డిస్త్రిబ్యూటరీల పనులు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
మంజీరా ఎత్తిపోతల పథకము నిజాంసాగర్ డ్యాం దిగువన మల్లూర్ గ్రామము నిజాంసాగర్ మండలములో చేపట్టుటకు 476 కోట్ల 25 లక్షల రూపాయలకు పరిపాలన ఆమోదం లభించి అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తి అయినదన్నారు.
ఈ వానాకాలము జిల్లాలోని నీటి వనరులలోకి అధికంగా నీరు రావటం వలన నిజాంసాగర్ ప్రాజెక్ట్, పోచారం ప్రాజెక్ట్, కౌలస్ నాలా ప్రాజెక్ట్ క్రింద ఉన్న మొత్తం ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతుందని, చిన్న నీటి వనరుల క్రింద 40 వేల ఎకరాలు సాగు జరిగిందన్నారు.
ఆహార భద్రత పథకము క్రింద క్రింద 2 లక్షల 53 వేల 816 రేషన్ కార్డుల ద్వారా 8 లక్షల 80 వేల158 మంది లబ్దిదారులకు నెలకు 13 వేల 487 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయటం జరుగుచున్నదని, జిల్లాలో గత మాసం 11 వేల 584 నూతన కార్డులు మంజూరీ చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో డబుల్ బెడ్ రూం పథకము పథకము క్రింద 514 కోట్ల 16 లక్షల రూపాయల వ్యయంతో 9,754 ఇండ్ల నిర్మాణమునకు నిధులు మంజూరు కాగా, 5,845 ఇండ్లు టెండర్ ప్రక్రియ ద్వారా వివిధ గ్రామాలలో ఇండ్ల నిర్మాణం చేపట్టబడినదన్నారు. ఇందులో 3,688 ఇండ్లు పూర్తి కాగా, 1,724 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని, నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఇంతవరకు 221 కోట్ల 8 లక్షలు వెచ్చించబడ్డాయన్నారు.
ఆసరా పథకము క్రింద మన జిల్లాలో అన్నిరకాల పించనులు కలిపి 1 లక్ష 49 వేల 919 మంది పింఛను లబ్దిదారులకు ప్రతి నెల రూ.32 కోట్ల 32 వేల రూపాయలు పంపిణీ చేయడము జరుగుతున్నదన్నారు.
దళితులకు భూమి పంపిణీ పథకము క్రింద జిల్లాలో ఇప్పటి వరకు 1,210 ఎకరముల భూమిని 56 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు వెచ్చించి 528 లబ్దిదారులకు పంపిణి చేయటమైనదని, పంపిణి చేసిన లబ్దిదారులకు 57 లక్షల రూపాయలతో 97 బోర్ వెల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, 54 లక్షల రూపాయలతో సబ్ మెర్సిబుల్ పంపు సెట్లు, 1 కోటి 29 లక్షల రూపాయలతో విద్యుత్తు కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందని, లబ్దిదారులకు మొదటి సారిగా పంటకు ఆర్ధిక సహాయం క్రింద 1 కోటి 93 లక్షల 9 వేల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.
కళ్యాణలక్ష్మి పథకము క్రింద గత సంవత్సరంలో 6,291 లబ్దిదారులకు 1 లక్ష 116 రూపాయల చొప్పున 62 కోట్ల 98 లక్షల 30 వేల రూపాయలు, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 1,461 లబ్దిదారులకు 14 కోట్ల 62 లక్షల 70 వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు. షాది ముభారాక్ పథకము క్రింద గత సంవత్సరంలో 880 లబ్దిదారులకు 1 లక్ష 116 రూపాయల చొప్పున 8 కోట్ల 77 లక్షల 78 వేల రూపాయలు, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 189 లబ్దిదారులకు 1 కోటి 89 లక్షల 22 వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు.
స్త్రీ మరియు శిశు సంక్షేమం క్రింద జిల్లాలో శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య శాఖల సమన్వయంతో ఆరోగ్య ప్రమాణములను పెంచుటకు తీసుకోనబడిన చర్యల ద్వారా మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు తగ్గించటంలో జిల్లా అనూహ్య ప్రగతిని సాధించడం జరిగినదని, సమగ్ర శిశు అభివృద్ధి సేవ ప్రాజెక్టులలో భాగంగా 1,193 అంగన్ వాడి కేంద్రాల…

Share This Post