పురోగతిలో ఉన్న పనులు వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ హరీష్

పురోగతిలో ఉన్న పనులు వేగవంతం చేయాలి  – జిల్లా కలెక్టర్ హరీష్

ప్రగతిలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, రైతు వేదికలు, వైకుంఠధామాలు, ఏడుపాయలలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పంచాయత్ రాజ్ శాఖా ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సమీక్షిస్తూ తూప్రాన్ మండలంలో గడ క్రింద చేపట్టి చివరి దశలలో ఉన్న మల్కాపూర్ గ్రామ పంచాయతీ, జిల్లా పరిషద్ పాఠశాల, యువజన సంఘ భవనం, ఫంక్షన్ హాల్, టాయిలెట్ బ్లాక్స్, వైకుంఠ ధామాల పనులను ఈ నెలాఖరునాటికి పూర్తి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని పాపన్నపేట, నిజాంపేట్ లలో కొన్ని వైకుంఠ ధామాల నిర్మాణాలు స్థలా భావం వల్ల పెండింగులో ఉన్నందున ప్రత్యామ్నాయంగా ఇతర స్థలాలను గుర్తించి నిర్మాణాలకు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించవలసినదిగా రెవిన్యూ అధికారులకు సూచించారు. నిధుల కొరత లేకున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ పనులు సరిగ్గా చేయని కాంట్రాక్టర్లకు షో కాస్ నోటీసులు ఇచ్చి తొలగించవలసినదిగా సూచించారు. అదేవిధంగా మనోహరాబాద్ గ్రామ పంచాయత్ రాజ్ భవనంతో పాటు ప్లాస్టరింగ్, రైతు వేడుకలలో ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్, టాయిలెట్స్ వంటి మిగిలిపోయిన చిన్న చిన్న పనులను తక్షణమే పూర్తి చేసి పెండింగులో ఉన్న 2 కోట్ల 89 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించారు. రూర్బన్ పధకం క్రింద పాపన్నపేట మండలంలో చేపట్టు 35 పనులకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని పంచాయత్ రాజ్ ఎస్ ఈ . ని ఆదేశించారు. ఏడుపాయలలో కన్వెన్షన్ హాల్, బస్సు స్టాండ్, కుకింగ్ షెడ్, చెప్పుల స్టాండ్ పనులను జనవరి చివరి నాటికి, మెదక్ లోని స్టేడియం లో ఫ్లోరింగ్, ఎలక్ట్రీషియన్, రేలింగ్ పనులను ఈ నెలాఖరు నాటికి ప్లూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా వివిధ పధకాల క్రింద పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు చేపట్టిన భవన నిర్మాణ పనులు, ఇతర పనుల తాజా పరిస్థితి, ఎప్పటిలోగా ప్లూర్తి చేస్తారో వివరాలందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, పంచాయత్ రాజ్ ఎస్.ఈ. కనకరత్నం, డి.ఆర్ .డి.ఓ. శ్రీనివాస్, తూప్రాన్ ఆర్.డి.ఓ. శ్యామ్ ప్రకాష్, జిల్లా యోవజన సంక్షేమాధికారి నాగరాజ్, ఏడుపాయల ఈ.ఓ. శ్రీనివాస్, పంచాయత్ రాజ్ డి.ఈ.లు, ఏ. ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post