పువ్వులను పూజించే గొప్ప పండగ,తెలంగాణ సంస్కృతి.సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఉభయ జిల్లాల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభకాంక్షలు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

.

తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను నిజామాబాద్,కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.సద్దుల బతుకమ్మ పండుగా పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలుతెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వు తో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుగపుకున్న ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు.ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు.ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువులు,నీటి కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేశారు.బతుకమ్మ పండుగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు

Share This Post