*ప్రచురణార్థం-1*
కాళేశ్వరం, ఏప్రిల్ 22: ఎడ్లబండ్లతో కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద పిండ ప్రదానం మొదలు స్నానాలకు వచ్చే వారికి స్థానిక రైతులు ఆహ్వానం పలుకుతూ, ఉపాధిని పొందుతున్నారు. దాదాపు 50 మంది రైతులు ప్రాణహిత పుష్కరాలకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి పుణ్య స్నానాలకు సకుటుంబ సమేతంగా తరలి వస్తున్న వారిని నదిలో కొంతదూరం ఎడ్లబండ్లపై తీసుకువెళ్లి, తిరిగి తీసుకువస్తూ తద్వారా ఉపాధిని పొందుతున్నారు. కాళేశ్వరంలో నది స్నానాలు మొదలుకొని దేవాలయంలో దర్శనం వరకు ఎక్కడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిచోట అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఘాట్ వద్ద స్నానాల కొరకు శావర్ లు ఏర్పాటు చేయడంతో పాటు , నదిలో లోతట్టు ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకుండా షిప్టుల వారిగా రెస్యూ టీంలు పహరా కాస్తు, భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. కాళేశ్వరం ఆలయం, ఘాట్, పరిసర ప్రాంతాల్లో చెత్తచెదారం లేకుండా, శానిటేషన్ సిబ్బందితో ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు.
———————————————-
సమాచార పౌరసంబంధాల శాఖ, కాళేశ్వరం మీడియా సెంటర్ నుండి జారిచేయనైనది.