పుష్టికరమైన పశుగ్రాసాల ద్వారా అధిక పాల దిగుబడి. డా|| జి.వి. రమేష్, జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి

పుష్టికరమైన పశుగ్రాసాలను పాడి పశువులకు మేపుట వలన అధిక పాల దిగబడిని పొందవచ్చు మరియు దీని వలన దాన ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ రైతులకు లాభసాటిగా ఉంటుందని జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి డా జి.వి.రమేష్ పేర్కొన్నారు.

30/07/21నాడు GUNDUR (కల్వకుర్తి)విజయ పాడి రైతుల సహకార సంఘము ,కల్వకుర్తి మండలములో తెలంగాణ రాష్ట్ర పాడి పరిష్రమాభివృది సమాఖ్య (TSDDCFL)-vijaya డైరీ. నాగర్ కర్నూలు పాల పరిధి వారు పశు సంవర్ధక శాఖ వారి సహకారముతో *ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రైతులను ఉద్దేశించి డా. జి.వి. రమేష్ ప్రసంగిస్తూ
మంచి పశుగ్రాసాలు అయిన సూపర్ నేపియర్, APBN, SSG898, PC-23, African tall maize, lucern, bersiem, అలసంద, పిల్లి పెసర మొదలగు పశుగ్రాసాలను మేపినట్లైతే పశువులలో పాల దిగుబడి పెరుగుతుందని , తద్వారా దాన ఖర్చు తగ్గుతుందని తెలిపారు . ఆరు లీటర్ల వరకు పాల దిగుబడి ఇచ్చే పశువును కేవలం పచ్చి మేత ద్వారా పోషించవచ్చు, ఆరు లీటర్ల కంటే అధిక దిగుబడి ఇచ్చే పశువులకు ప్రతి రెండు కిలోల పాల దిగుబడి ఒక కిలో మిశ్రమ దాన ప్రతి రోజు అందించాలి. వీటితో పాటు రోజుకు ఒకొక్క పశువుకు 50-70 గ్రాములు ఖనిజ లవణ మిశ్రమాన్ని అందించాలి, అవసరాన్ని బట్టి పాడి పశువులకు కాల్షియం ద్రావణాన్ని అందించాలి అని తెలియచేశారు. పశుగ్రాసo వృథాను నివారించాలంటే ప్రతి రైతు విధిగా చాఫ్ కట్టర్ ను ఉపయోగించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమములో నాగర్ కర్నూల్ పాల పరిధి Deputy director సత్యనారాయణ యాదవ్ గారు మాట్లడుతూ పాడి రైతుల సంక్షేమం కొరకు TSDDCF – విజయ డైరీ తీసుకుంటున్న చర్యలు,మున్ముందు రాబోతున్న పథకాల గురించి వివరించడం జరిగింది విజయ డైరీ కి పాలు విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో డా శ్రీనాథ్, విజయ డైరీ సిబ్బంది
పాల శీతలీరణ కేంద్ర మేనేజర్ యాకన్న ,ప్రొక్యుర్మెంట్ సూపర్వైజర్ జానకి, నవీన్, మన్నన్, ఆంజనేయులు, నరేష్ మరియు గుండూరు పాడి రైతుల సహకార సంఘ అధ్యక్షులు నరేందర్ , గ్రామ సర్పంచ్ మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

డా|| జి.వి. రమేష్, జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి

Share This Post