పుస్తకం కాగితం రూపంలో ఉన్న విజ్ఞాన బాండాగారం :: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 2:

పుస్తకం అనేది కాగితం రూపంలో ఉన్న విజ్ఞాన భాo డాగారమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎస్.ఆర్.బి.జి.ఎన్.ఆర్. కళాశాల మైదానంలో తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ బుక్ ట్రస్ట్ లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఖమ్మం పుస్తక మహోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుస్తకాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి రోజు కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించాలన్నారు. పుస్తకానికున్న విలువ మరియే ఇతర వస్తువుకు లేదని మంత్రి అన్నారు. మనతో పాటు, మన తర్వాత కూడా ఉండిపోయేది పుస్తకమని ఆయన తెలిపారు. పుస్తకం ఒక్కరికే విజ్ఞానం ఇవ్వదని, ఒకరి నుండి ఒకరికి ఎంతో మందికి విజ్ఞానం అందిస్తుందని ఆయన అన్నారు. ఒక పుస్తక ప్రచురణ మహా యజ్ఞం లాంటిదని, ఈ అవకాశాన్ని రాబోయే తరాల వారికి అందజేయాలన్నారు. ప్రతి సంవత్సరం 2 జూన్ నుండి 8 రోజులపాటు ఖమ్మం పట్టణంలో పుస్తక మహోత్సవం వుంటుందనే విషయం ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. పుస్తక మహోత్సవానికి ప్రాచుర్యం కల్పించాలని, పుస్తక ప్రియులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంచి పుస్తకాలు, జిజ్ఞాస కల్గించే పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, ఇట్టి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, 46 కు పైగా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాను రాను పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతుందని, ఇది మంచిది కాదని అన్నారు. పుస్తక మహోత్సవాల నిర్వహణతో పుస్తకాలపై మొహం కల్గుతుందని, పుస్తక పఠన అలవాటును చేసుకుంటారని అన్నారు. పుస్తకం లేని గది మూగదని కలెక్టర్ అన్నారు. ఎంతో మంది తమ అనుభవాలతో పుస్తకాలు రాస్తారని, వాటిని చదవడంతో మనకు మంచి, చెడు, చేయాల్సిన, చేయకూడని వాటిపై అవగాహన వస్తుందని అన్నారు. చదవడం ఆపేస్తే మనిషే కాడని, చదువుతో ఉన్నతని, చదువుతో అభివృద్ధి చెందవచ్చని ఆయన అన్నారు. పుస్తక మహోత్సవాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పెద్ద ఎత్తున రావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను తేవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ పునుకోలు నీరజ, సుడా ఛైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ లక్ష్మీ ప్రసన్న, కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జాకీరుల్లా, బుక్ ఫెర్ కార్యదర్శి మోహన్, సీనియర్ పాత్రికేయులు ప్రసేన్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post