ప్రచురణార్ధం
ఆగష్టు 06 ఖమ్మం:
పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలని. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నగరంలోని సీక్వెల్ రీసార్ట్స్ లో సెంట్రల్ బుక్ షాపు ఆఫ్ హైద్రాబాదు. వారిచే ఏర్పాటు చేసిన “బుక్ ఫెయిర్”ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ను నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు, యువతతో పాటు చిన్నారులు కూడా పుస్తకాలు చదవే అలవాటు చేసుకోవాలని, ప్రస్తుత ఆన్లైన్ కాలంలో చిన్నారులు సెల్ఫోన్, టెలివిజన్లు, ట్యాబ్లకు అలవాటు పడ్డారని, వారిని పుస్తక పఠనం వైపు మళ్ళించి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదివే విధంగా తీర్చి దిద్దాలని కలెక్టర్ అన్నారు. పుస్తకపఠనం ద్వారా విజ్ఞానం పెంపొందుతుందని, ఎంత చదివినా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని, విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
సెంట్రల్ బుక్ షాప్ ఆఫ్ హైద్రాబాదు నిర్వాహకులు సిద్ధార్థ్ మాట్లాడుతూ చిన్నపిల్లలు మొదలుకొని 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఉపయోగపడే వివిధ రకాల పుస్తకాలు, స్టేషనరీను బుక్ ఫెయిర్లో అందుబాటులో ఉంచామని, ఈ నెల 6 నుండి 8 వరకు మూడురోజుల పాటు బుక్ ఫెయిర్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.
డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహరా, కార్పోరేటర్ పగడాల నాగరాజు, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, నిర్వాహకులు మమత, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.