పూడు భూముల పరిష్కారం కొసం అధికారులు, ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం

జిల్లాలో పోడు భూముల పరిష్కారం కొసం గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీల ఏర్పాటుపై తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, స్పెషల్ ఆఫీసర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు, ఎంపీపీ లు,జడ్పీటీసీలు,
సర్పంచ్లు తదితరులకు జిల్లా అధికాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

శనివారం స్థానిక DPRC భవనములో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిఖిల
మాట్లాడుతూ, ఈనెల 8 నుండి పొడుభూముల పరిష్కారం కొసం గ్రామ స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ ల అధ్యక్షతన కమిటీలో రెవిన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ శాఖలతో పాటు 7 గురు గిరిజన రైతులను ఇట్టి కమిటీలలో సభ్యులుగా ఉంచాలని అందులో ముగ్గురు మహిళలు ఉండాలని తెలిపారు. ఈనెల 8న మొదటి గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఆటవి హక్కుల చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికి క్లెయిమ్ ఫామ్స్ అండేటట్లు చూడాలన్నారు.
రెండవ రోజు గ్రామ సభ నిర్వహించి రైతుల నుండి ఫిర్యాదులు మాత్రమే స్వీకరించాలని సూచించారు.
అధికారులు అందరు సమన్వయంతో పని చేసి అర్హులైన గిరిజన రైతులకు RoFR హక్కు పత్రాలు పొందేలా చూడాలన్నారు. తూచ తప్పకుండ అవసరమైన రిజిస్టర్లు గ్రామ, మండల స్థాయిలో నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో 1,08,791 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని, 13 మండలాలలో 27 స్థలాలలో 2449 ఎకరాల అటవీ భూమి అక్రమణకు గురైందని, మరి కొన్ని గ్రామాలు పెరిగే అవకాశం ఉందని తెలియజేసినారు.
ఈ అవగాహన కార్యక్రమంలో
జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ వేణుమాధవరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, వికారాబాద్, తాండూరు రెవిన్యూ డివిజన్ అధికారులు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్ తహసీల్దార్, ఎంపీడీఓ లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఫారెస్ట్ అధికారులు, సర్పంచ్లు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post