పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులచే దరఖాస్తు చేయించాలి…

పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులచే దరఖాస్తు చేయించాలి…

ప్రచురణార్థం

పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులచే దరఖాస్తు చేయించాలి…

మహబూబాబాద్ జనవరి 7.

రెండు పడక గదుల ఇల్లు నిర్మాణాలలో 75 శాతం పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని విద్యుత్ త్రాగు నీరు వంటి కనెక్షన్ లకు దరఖాస్తు చేయించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ సమావేశ మందిరంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల ప్రగతిని రెవెన్యూ విద్యుత్తు మిషన్ భగీరథ అధికారులతోనూ భవన నిర్మాణాల ఇంజనీరింగ్ అధికారులతోను కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు 75 శాతం పూర్తి కాగానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని, లబ్ధిదారుల పేర్లపై విద్యుత్ మిషన్ భగీరథ కనెక్షన్ లను తీసుకోవాలని తెలిపారు.

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యక్తిగత ఇండ్లకు లేఅవుట్ చేయించాలని గ్రామ సభ లోనే ఎంపిక జరగాలని అధికారులకు సూచించారు.

70 శాతం దాటిన ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యేక నివేదిక లో చూపించాలన్నారు.
75 శాతం నుండి 80 శాతం లోపు రెండు పడక గదుల ఇండ్లకు గ్రామసభ ఎంపిక విద్యుత్ కనెక్షన్లు మిషన్ భగీరథ వంటివి తీసుకొని పూర్తి అయినట్లుగా నివేదికలో చూపించాలన్నారు.

పూర్తవుతున్న ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల లోనూ మిషన్ భగీరథ కలెక్షన్లలోనూ జాప్యం చేయరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కొత్తగా నిర్మించే ఇళ్లకు విద్యుత్ లైన్ త్వరితగతిన వేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం లో కావలసిన ఇసుక కొరకు ముందుగా సమాచారం ఇవ్వాలని మంజూరు చేసిన ఇసుక ను ఉదయం 6 నుండి సాయంత్రం 5 లోపు రవాణా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు

ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా పరంగా ఉండే విధంగా అధికారులు పర్యవేక్షించాలి అన్నారు

ఈ సమీక్ష సమావేశంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ నోడల్ అధికారి సదానందం మిషన్ భగీరథ అధికారి కృష్ణారెడ్డి విద్యుత్ అధికారి సునీత దేవి ఇంజనీరింగ్ అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత డి ఈ మధుకర్ రోడ్లు భవనాలు డి ఈ రాజేందర్ ఇరిగేషన్ ఈ ఈ (పాలకుర్తి) రమేష్ బాబు తాసిల్దార్ లు నెల్లికుదురు రఫీయుద్దీన్, తొర్రుర్ రాఘవ రెడ్డి, పెదవంగర సరితా రాణి, డోర్నకల్ వివేక్, మరిపెడ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
———————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post