ప్రచురణార్థం
మహబూబాబాద్, మార్చి, 24.
ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59 క్రింద పూర్తయిన పట్టాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు
శుక్రవారం ఐ డి ఓ సి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.
కంటి వెలుగు ఆరోగ్య మహిళ 58, 59 ప్రభుత్వ నిబంధనలు, పోడు హక్కు పత్రాలు, ప్రమాద సంఘటనలు జరగకుండా పాటించవలసిన నిబంధనలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకొనబోయే చర్యలు ప్రభుత్వ కార్యాలయాలని ఒకే చోట ఐడిఓసి లోకి తరలింపుకు చర్యలు వైకుంఠధామాలు సోషల్ ఆడిటర్ అభ్యంతరాలు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఇంటర్ ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ ప్లాంటేషన్ నర్సరీల నిర్వహణ తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 58 59 ప్రభుత్వ నిబంధన కింద పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు అలాగే పోడు హక్కు పత్రాల పరిశీలన వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతుందని ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని వైకుంఠధామాలు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీశాఖ అధికారి రవి కిరణ్ అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, డేవిడ్ మహబూబాబాద్ తొర్రూరు ఆర్డీవోలు కొమరయ్య రమేష్ డి ఆర్ డి ఓ సన్యాసయ్యా వైద్య శాఖ అధికారి హరీష్ రాజు, విద్యాధికారి రామారావు పంచాయతీ అధికారి ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.