పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్

కామారెడ్డి, మార్చ్ 11,2022: —————— 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ ,ఎస్టీ , బిసి శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారులను, ప్రిన్సిపల్ లకు సూచించారు. ఆధార్ అతంటి కేషన్ కోసం కోసం పెండింగ్లో ఉన్న విద్యార్థిని, విద్యార్థులు మీ దగ్గరలోని మీసేవ కేంద్రం నందు ఆధార్ అతంటికేషన్ చేయించుకోవాలని కోరారు. కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపకార వేతనాల కోసం అర్హత ఉన్న ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి ని రజిత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ————– జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది

Share This Post